Parrots: ఎలాంటి పక్షులు ఇళ్ల వద్దకు వస్తే మంచిదో తెలుసా?

Parrots: సనాతన ధర్మంలో దేవతలే కాకుండా జంతువులు పక్షులు, చెట్లను కూడా పూజిస్తారు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఆనందం, సంపద కోరుకుంటారు. దీనికి కేవలం మతపరమైనవే కాకుండా వాస్తు శాస్త్రం అనేక పరిహారాలు చెప్పబడ్డాయి. వాస్తు శాస్త్రంలో కూడా పక్షుల ప్రస్తావన ఉంది. కొన్ని పక్షులు ఇళ్ల వద్దకు వస్తే శుభప్రదంగా భావిస్తారు. ఇళ్లలో పిచ్చుకలు కిలకిల చేస్తే ఇంట్లో శుభకార్యం ప్రారంభం అయి బంధువులతో కిటకిటలాడుతుందని భావిస్తారు. ఒకేసారి చిలుక గోరింక ఇంటి పరిసరాల్లో వస్తే మీ ఇంట్లో కొత్త జంట ఒకటవుతుందని చెబుతుంటారు.

వాస్తు శాస్త్రంలో మనకు ఆనందాన్ని కలిగించే అనేక సంకేతాలు కూడా ఉన్నాయి. అకస్మాతుగా ఇంట్లో చిలుక ప్రవేశిస్తే మీరు ఎక్కడి నుంచైనా సంపద వస్తుందని అర్థం. గుడ్లగూబాను లక్ష్మీదేవి వాహనం గా భావిస్తారు. ఇళ్లు లేక చుట్టుపక్కల గుడ్లగూబ కనిపిస్తే, మంచి జరగబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో పక్షి గూడు కట్టుకుంటే మీ ఇంట్లో త్వరలో ఆనందం వస్తుందని పక్షి రాక కూడా అడ్డంకులను అధిగమించడానికి సంకేతం.

మీ ఇంటి చుట్టుపక్కల లేదా మీ ఇంటి పైకప్పుపై కోళ్ల శబ్దం వినబడితే, మీరు పాత స్నేహితులను కలుస్తారని శాస్త్రలు చెబుతున్నాయి. కాకి సైతం ఇంట్లోకి వస్తే శుభం జరుగుతుందని భావిస్తారు. కాకి ఇంటిపై లేదా ఇంటి ముందు అరిస్తే బంధువులు వచ్చి శుభకార్యం జరుగుతుందని చాలా మంది నమ్ముతారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -