Shivaji: అధికారంలోకి వస్తే మాత్రం ఒక్కొక్కరిని కొట్టే చంపుతాం: శివాజీ

Shivaji: ఆపరేషన్ గరుడ అంటూ రాజకీయాలలోకి వచ్చారు నటుడు శివాజీ. గత ఎన్నికల సమయంలో ఈయన టిడిపి పార్టీకి మద్దతుగా ఆపరేషన్ గరుడ పేరుతో పెద్ద ఎత్తున పాలిటిక్స్ లో రచ్చ చేశారు. రాజకీయాలలో ఎదురు దెబ్బ తగలడం కొన్ని రోజులపాటు కనుమరుగైపోయిన శివాజీ తాజాగా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా వచ్చి రాగానే రాజకీయాల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

తాజాగా ఒక ప్రైవేట్ పార్టీలో పాల్గొన్న శివాజీ ఏపీ రాష్ట్ర రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కొన్ని నియోజకవర్గాలలో సర్వే చేశానని, ఈసారి అధికార పార్టీకి ఏమి లేదంటూ ఈయన వెల్లడించారు. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కేవలం వెయ్యి, రెండు వేల ఓట్లతో గెలుస్తాడని ఈయన తెలిపారు.ఇకపోతే ఎన్నికలలో ఏ పార్టీకి మద్దతుగా నిలబెడుతున్నారో తెలియదు కానీ ఖచ్చితంగా తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మేము కనుక అధికారంలోకి వస్తే ఒక్కొక్కరిని చచ్చేలా కొడతామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇలా ఈయన మాట్లాడేసరికి కొందరు గట్టిగా కేకలు వేయడంతో మరింత రెచ్చిపోయి మాట్లాడారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ పోలీసులు అండతో పార్టీ నాయకులు ఎక్కడో ఒకచోట నిత్యం టిడిపి నాయకుల పై జనసేన నాయకులపై దాడులకు దిగుతున్నారు. ఒకవేళ మీరు కొట్టేలా ఉంటే చచ్చిపోయేలా కొట్టండి కానీ బ్రతికారంటే మాత్రం నా ***రా అంటూ పెద్ద ఎత్తున వార్నింగ్ ఇచ్చారు.

ఈరోజు మీరు అధికారంలో ఉండి పోలీసులు మీ వెంట ఉండొచ్చు అదే రేపు మేము అధికారంలో ఉంటే ఆ పోలీసులు మా వద్దకు రారా? అది కాదు ప్రజాస్వామ్యం అంటే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ మేము తప్పు చేసి ఉంటే మమ్మల్ని లోపల వేయండి ఇలా దౌర్జన్యాలకు పాల్పడడం మంచిది కాదంటూ వార్నింగ్ ఇచ్చారు.మేము ఎలా పుట్టామో మీరు కూడా అలాగే పుట్టింటారు మీకు ఎక్స్ట్రా కొమ్ములు ఏమీ లేవు కదా అంటూ శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -