Politics: తమ్ముడిని అడిగితే ప్యాకేజీ గురించి తెలుస్తుందిగా.. నెటిజన్ల కామెంట్స్ వైరల్!

Politics: తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన నటుడు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం రాజకీయపరంగా జగన్ పై ఏదో ఒక సెటైర్ వేస్తూ బాగా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాడు. ఇక ఈయన వేసే సెటైర్లకు తిరిగి ఈయనపై బాగా ట్రోల్స్ వస్తూ ఉంటాయి.

అయితే తాజాగా మరోసారి ఆయన బాగా ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. ఇంతకు అసలు విషయం ఏంటంటే.. తాజాగా నాగబాబు జనసేన అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ తో ప్యాకేజీపై డిబేట్ నిర్వహించాడు. దీంతో వారి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక నాగబాబు అజయ్ తో మాట్లాడుతూ.. నాకు ఒక సందేహం ఉంది దాన్ని క్లియర్ చేయు అంటూ అసలు ప్యాకేజ్ అంటే ఏంటో అర్థం చెప్పమని అని అడిగాడు.

 

దీంతో అజయ్ ఈ మధ్య బాగా వింటున్న బ్రదర్.. పెద్దపెద్దోళ్లంతా ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు అని అన్నాడు. ఇక ఉన్న విషయం గురించి మాట్లాడుకుందాం అంటూ.. ప్యాకేజ్ అనే మాట విన్నప్పుడల్లా ఒక మనిషి గుర్తుకొస్తాడని.. రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పెద్ద పారిశ్రామికవేత్తను పంపించారు అని అన్నాడు.

 

అంతేకాకుండా ఆయనకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏంటి సంబంధం అని.. అసలు ఆయన ఏరి కోరి ఎందుకు రాజ్యసభ ఇచ్చాడు అని.. ఆయన ఏమైనా ఆంధ్రప్రదేశ్ గురించి అడిగారా అని చూస్తే ఇప్పటివరకు ఏమీ చేయలేదు అని అన్నాడు అజయ్. ఇక వెంటనే నాగబాబు ఏమి చేయనందుకు ఎందుకు రాజ్యసభ ఇచ్చారు అని అడగటంతో.. వెంటనే అజయ్.. ఏం లేదు అంత ప్యాకేజీ మహిమ అని తిరిగి స్పందించాడు.

 

దాంతో నాగబాబు అంటే ప్యాకేజీ తీసుకొని రాజ్యసభ ఇచ్చాడు అంటావు అని.. జగన్ ప్యాకేజీ తీసుకోవడమే కాదు ఇవ్వడంలో కూడా నిష్ణాతుడే అని కామెంట్ చేశాడు. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా జగన్ పై చేసిన విమర్శల వీడియోని కూడా చూపించాడు. ఇక దీంతో వీరి మధ్య జరిగిన డిబేట్ ని చూసి నెటిజెన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్యాకేజీ గురించి మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ ని అడుగు నాగబాబు.. ఆయనని అడిగితే సరిగా తెలుస్తుంది కదా అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -