Relationship: ఈ నాలుగు పనులు చేస్తే భాగస్వామి మనస్సు గెలుచుకోవచ్చట.. ఎలా అంటే?

Relationship: సమాజంలో ఎన్నో మార్పు వస్తున్నా సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడేందుకు మెుహం మాటం చూపుతున్నారు. అది ఒక నేరంగా భావిస్తున్నారు. సరే బయట ఎలాగో మాట్లాడరు కదా, పడక గదిలో భార్యతో అయినా, భర్తతో భార్య అయినా మాట్లాడే అవకాశం ఉంటుందా అంటే అదీ లేదు. ఫలితంగా సెక్స్ ను సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతున్నారు.

ముఖ్యంగా సెక్స్ పై పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ అవగాహన ఉంటుంది. సెక్స్ గురించి మాట్లాడుకునేందుకు వారు మెుహమాట పడదు.నిజంగా అలానే ఉండాలని శాస్త్రాలు,సెక్స్ మీద జరిగే అధ్యయనాలు చెబుతున్నారు.దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు
ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. మన దేశంలో మాత్రం దీన్ని ఓ నేరంగా చూస్తూనే ఉన్నారు.

సెక్స్ విషయంలో మగవారికి, ఆడవారికి ఎన్నో అపోహాలు అనుమాలు ఉంటాయి. వారు కోరుకున్న విధంగా పార్టనర్ తో కోరిక తీర్చుకునేందుకు సిగ్గపడుతుంటారు. ఫలితంగా తృప్తి లేకుండానే ఆ పనిని ముగిస్తుంటారు.మీరు మీ పార్టనర్‌ను మెప్పించే విధంగా సెక్స్ చేస్తేనే రియల్ హీరో. మీరు ఆ సమయంలో మీ పార్టనర్‌తో ప్రేమగా వ్యవహరిస్తేనే సెక్స్‌లో ఆనందాన్ని పొందుతారు. లేదంటే మెకానికల్‌గా ఆ పని పూర్తి చేసిన వారవుతారు.

సెక్స్ విషయంలో భార్య, భర్త మధ్య ఎటువంటి మెుహమాటం ఉండకూడదు. అప్పుడప్పుడు కవ్వించే మాటలతో ఎంజాయ్ చేయాలి. ప్రేమగా చెవిలో మీ భాగస్వామిపై మీకున్న ఇష్టాన్ని తెలియజేయండి. చాలామంది అమ్మాయిలు అబ్బాయిల్లో కోరుకునేది ఇదే. సెక్సును పనిగట్టుకుని చేయకుండా ప్రేమతో మాట్లాడుతూ చేయాలని భావిస్తారు.

ముందుగా ఎప్పటికప్పుడు సెక్సులో ఏ విధంగా పాల్గొంటే తనకు ఇష్టమనేది మీ భాగస్వామిని అడిగి తెలుసుకోండి. లైట్స్ ఆఫ్ చేయాలా, ఉంచాలా? ఏ భంగిమలో చేస్తే నీకు నచ్చుతుంది? తదితర అభిప్రాయాలను తెలుసుకోండి.మీ భాగస్వామి అభిప్రాయాన్ని తెలుసుకోకుండా నేరుగా ఆ పనిలోకి వెళ్లిపోకండి. ఎందుకంటే వారి ఇష్టప్రకారం చేస్తే వచ్చే తృప్తి వేరే లెవల్.

మీరు పురుషుడైనా, స్త్రీ అయినా మీ భాగస్వామి సెక్స్ సామర్థ్యాన్ని మెచ్చుకోవల్సిందే. ఏదైనా మంచి పని చేసినప్పుడు ఎలా అభినందనలు తెలుపుతామో, అలా సెక్స్ సమయంలో కూడా మీ భాగస్వామిని ప్రశసించండి. మీ కాంప్లిమెంట్స్ భాగస్వామిలో మరింత ఉత్సాహాన్ని పెంచుతాయి. మళ్లీ మళ్లీ సెక్స్ చేసేందుకు మార్గాన్ని సులభం చేస్తాయి. పైగా అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -