
అత్యవసర పొదుపు నిధి ఏర్పాటు చేసుకోకపోతే ఎంత సంపాదించిన ఆదాయం కన్పించదు. వడ్డీలు, అసలు చెల్లింపులతోనే సంపాదన ఖర్చు అయిపోతుంది. అప్పుల నుంచి బయట పడటం కూడా కష్టతరమవుతుంది. మొదట ఓ వ్యక్తి తన నికర ఆస్తుల విలువ ఎంతన్నది తెలుసుకోవాలి. మొత్తం ఆస్తుల నుంచి అప్పులు తీసివస్తే నికర విలువ వస్తుంది. కొంతమందికి ఎటువంటి ఆస్తులు ఉండకున్నా కానీ.. విపరీతమైన అప్పులు చేస్తుంటారు. అలాంటప్పుడు ఆర్థిక బాధ్యతలు మాత్రమే ఆ వ్యక్తికి ఉంటాయి. ఎక్కువ మంది తమకు అనుకోకుండా వచ్చే ఖర్చుల కోసం అప్పులు చేస్తుంటారు. అందుకే తొలుత ప్రతి వ్యక్తి తన సంపాదనలో కొంత మొత్తాన్ని తీసి అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం . ద్వారా అప్పుల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.
అప్పుల బాధ ఎక్కువుగా ఉందని చాలా మంది చింతిస్తూ ఉంటారు. ఆ రుణాలు తీర్చడానికి తమ సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని వెచ్చిస్తారు. అప్పులు ఉన్నవారు కూడా కొద్ది నెలల పాటు ఓ అత్యవసర పొదుపు నిధిని ఏర్పాటు చేసుకున్న తర్వాత.. తమ రుణాలను చెల్లించాలి. అప్పులు చెల్లించే సమయంలో మధ్యలో ఏవైనా ఊహించని ఖర్చులు వస్తే రుణం వైపు వెళ్లకుండా.. అత్యవసర పొదుపు నిధిలో డబ్బులు తీసే ఖర్చు చేయడం ద్వారా అప్పుల వైపు మళ్లకుండా ఉండొచ్చు. ఇలా చేయడం ద్వారా ఇప్పటికే ఉన్న రుణాలు తీరిపోయిన తర్వాత అప్పులు లేకుండా ప్రశాంతమైన జీవితం గడపవచ్చు.