Bread: బ్రెడ్ తింటే సన్నగా అవుతారా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Bread: ప్రస్తుత రోజుల్లో చాలామంది స్త్రీలు పురుషులు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ అధిక బరువు సమస్య కారణంగా ఏ పనులు చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అధికబరువును తగ్గించుకోవడం కోసం నిత్యం ఎన్నో రకాల వ్యాయామాలు, ఎక్సర్ సైజులు, జిమ్ వర్క్ ఔట్స్ చేస్తూ ఎన్నో రకాల చిట్కాలను పాటిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఫలితం లేదని బాధపడుతూ ఉంటారు. అయితే అధిక బరువు సమస్య ఉన్నవారు ఎటువంటి వస్తువులు తినాలి అన్న కూడా సంకోచిస్తూ ఉంటారు.

 

ఏదైనా ఆహార పదార్థాలు తీసుకోవాలి అంటే తింటే బరువు పెరుగుతామేమో అని భ్రమ పడుతూ కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారు. అటువంటి వాటిలో బ్రెడ్ కూడా ఒకటి. చాలామంది బ్రెడ్ తినడం వల్ల లావు పెరుగుతారు అని అనుకుంటూ ఉంటారు. మరి బ్రెడ్ తింటే నిజంగానే లావు పెరుగుతారా లేదా ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బ్రెడ్ అధిక బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుంది అంటున్నారు. ఫిట్‌నెస్ ట్రైనర్స్. కొందరు మిల్క్ కంటెంట్ ఎక్కువగా ఉన్నా వైట్ బ్రెడ్‌ను తీసుకునేందుకు ఇష్టపడుతుంటారు. దాని వలన బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

దాని స్థానంలో హోల్ వీట్ బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. నార్మల్ బ్రెడ్‌లో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. దాంతో మన బరువు పెరుగే అవకాశం ఉంటుంది. కానీ గోధుమ పిండితో చేసిన బ్రెడ్‌లో వివిధ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. బరువు తగ్గించడంతో పాటు గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే టైప్ 2 డయాబెటిస్ బారిన పడకుండా కూడా చూస్తుంది. హోల్ గ్రెయిన్ బ్రెడ్, తృణధాన్యాలతో చేసిన బ్రెడ్ మనిషి అధిక బరువు నుంచి బయట పడేందుకు తోడ్పడుతుంది.

 

వోట్స్, బార్లీ, మొక్కజొన్న, ఇతర ధాన్యాలు శరీరానికి పోషకాలను అందిస్తాయి. ఈ బ్రెడ్ ఆహారంలో తీసుకోవడం వలన గుండె జబ్బుల నుంచి ముప్పు తప్పుతుంది. అలాగే మొలకెత్తిన ధాన్యాల ద్వారా తయారైన బ్రెడ్ తినడం వలన పోషక విలువలు పెరుగుతాయి. ఈ గింజలు తినడం వల్ల శరీరానికి కూడా మంచి పోషకాలు అందుతాయి. ధాన్యపు రొట్టెలు వేగంగా బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నిలువరిస్తుంది. ఓట్ మీల్ బ్రెడ్ కూడా బరువును తగ్గిస్తుంది. ఓట్‌మీల్ బ్రెడ్‌లో ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ బి1, ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. అవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి.

 

Related Articles

ట్రేండింగ్

Sonu Sood: సోనూసూద్ ను కలవడానికి నడిచి వెళ్లిన వ్యక్తి.. చివరకు?

Sonu Sood: సోనూసూద్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కరోనా అలాంటి విపత్కర పరిస్థితులలో ఎంతోమందికి అండగా నిలిచి రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నాడు. కరోనా లాక్‌డౌన్ సమయంలో వేలాది...
- Advertisement -
- Advertisement -