Pista Benefits: పిస్తా తింటే ఆ రెండు సమస్యలకు చెక్.. అవేంటంటే?

Pista Benefits: డ్రై ఫ్రూట్లలో ఒకటైన పిస్తా డ్రై ఫ్రూట్ గురించి మనందరికీ తెలిసిందే. పిస్తా వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంతో పాటు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్, కార్బోహైడ్రేట్స్, అమైనో ఆమ్లాలు, విటమిన్లు ఏ,కె, సీ,6, డి, ఈ, ప్రోటీన్, కాల్షియం, మాంగనీస్, ఫోలేట్, ఇతర డ్రై ఫ్రూట్స్ కంటే తక్కువ కొవ్వు, కేలరీలు ఉంటాయి. పిస్తా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చడంతో పాటు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుంది.

మరి ముఖ్యంగా పిస్తా డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. డయాబెటిస్ తో పాటు బీపీ పేషెంట్లకు కూడా పిస్తా బాగా సహాయపడుతుంది. పిస్తా లో ఆరోగ్యమైన కొవ్వు పదార్ధాలు ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్ తో పాటు వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇది తింటే బరువు తగ్గడం, గుండె ఆరోగ్యానికి మంచి పుడ్. 28 గ్రాముల పిస్తాలో 159 కేలరీలు, 8 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 3 గ్రాముల ఫైబర్, 13 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు, 6 శాతం పొటాషియం వంటి అనేక పోషక విలువలు ఉన్నాయి. బీపీ, కొలెస్ట్రాల్ తగ్గించడంలో పిస్తా ఎంతగానో సహాయపడుతుంది.

 

గుండె జబ్బుల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అధిక బరువు సమస్యతో బాధపడేవారు పిస్తాలను తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు. అంతేకాకుండా మధుమేహంతో బాధపడేవారికి కూడా పిస్తా చక్కని ఔషధం అని చెప్పవచ్చు. ఇందులో ఇతర డ్రై ఫ్రూట్స్‌తో పోలిస్తే కార్బోహైడ్రేట్లు పుష్కలంగా లభిస్తాయి. పిస్తాలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అంటే పిస్తా రక్తంలోని షుగర్ లెవల్స్‌ను కూడా నియంత్రిస్తుంది. పిస్తా తినడం మంచిదే కానీ మితిమీరి తినడం వల్ల ఎన్నో రకాల సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -