Raisins: మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లలో వచ్చి కారణాలతో వివిధ అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. వయస్సు భేదం లేకుండా అన్ని రకాల వ్యాధులు సోకుతున్నాయి. ఇవన్నీ ఒకవైపు అయితే.. ఉరుకులు పరుగుల జీవితంలో పని ఒత్తిడి, ఇతరాత్రా కారణాలతో సరైన సమయానికి భోజనం దూరం చేసుకుంటున్నారు. ఈ కారణమే మనిషిని వివిధ రోగాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సమయానికి ఆహారం తీసుకోకపోవడంతో చాలా మంది గ్యాస్, ఎసిడిటీ సమస్యతో సతమతమవుతున్నారు. సరైన సమయానికి తినకపోవడంతో జీర్ణక్రియ సరిగా పనిచేయక వివిధ రకాల వ్యాధులు వేధిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గ్యాస్, ఎసిడిటితో అల్సర్ వ్యాధులు వచ్చి పేగులకు పుండ్లు వచ్చే ప్రమాదం కూడా ఉంటుందట. ఉరుకులు పరుగుల జీవితం గడిపేవారు సరిగా తినకపోవడం, సరిగా నిద్రలేకుండా జీవితాన్ని గడిపేవారికి జీర్ణక్రియ పనితీరుపై ప్రభావం చూపుతోంది. మరికొందరు బయట దొరికే కల్తీ నూనెలతో తయారు చేసిన ఆహారం తీసుకోవడం వలన కూడా అనారోగ్యం పాలవుతున్నారు. ఇది కూడా జీర్ణక్రియ పనితీరుపై ప్రభావం చూపుతుంది. దీంతో చాలా మంది గ్యాస్, ఎసిడిటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు జీవితాంతం ఆస్పత్రులు, మెడిసిన్ తీసుకుంటుంటారు. గ్యాస్, ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు వారి వెంట అందుకు సంబంధించిన ట్యాబ్లెట్ పెట్టుకుని బయటకు వెళ్లే దుస్థితి నెలకొంది. ఇలాంటి సమస్యతో బాధపడేవారు రోజు ఉదయం ఎండు ద్రాక్ష తింటే గ్యాస్ సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
తిన్న ఆహారం సరిగా జీర్ణం కావాలన్నా.. కడుపులో గ్యాస్ పేరుకుపోకుండా ఉండాలన్నా.. అపాన వాయువు సమస్యలు రాకుండా ఉండాలన్నా.. ఎసిడిటి సమస్యలు వచ్చి కడుపులో మంటలు రాకుండా ఉండాలన్నా.. ఉదయం ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష తింటే చాలు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు, పాలీఫెనాల్స్, ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉండటంతో శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందట ఇలా నిత్యం చేస్తే గ్యాస్, అల్సర్, మలబద్ధకం లాంటి సమస్యలు మీ వైపు రావని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.