Health Tips: ఈ చిట్కాలు పాటిస్తే పీరియడ్స్ నొప్పికి సులభంగా చెక్.. ఏం చేయాలంటే?

Health Tips: సాధారణంగా మహిళలు ప్రతినెల నెలసరి సమయంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు.చాలామంది మహిళలు నెలసరి సమయంలో తీవ్రమైన కడుపునొప్పి వెన్నునొప్పి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలా ఈ నొప్పితో బాధపడేవారు కనీసం పైకి లేవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు.ఈ విధమైనటువంటి ఇబ్బందితో బాధపడేవారు ఈ సింపుల్ చిట్కాలను పాటించడం వల్ల ఈ నొప్పి నుంచి ఉపశమనం పొంద వచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…

పీరియడ్స్ సమయంలో గోరువెచ్చని నీటితో స్నానం చేయటం వల్ల మనం ఈ నొప్పి సమస్య నుంచి బయటపడవచ్చు. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల బాడీ పెయిన్స్ తగ్గడమే కాకుండా వెన్ను నొప్పి కడుపు నొప్పి సమస్య నుంచి కూడా కాస్త ఉపశమనం కలిగిస్తుంది.అలాగే నొప్పి ఉన్న ప్రదేశంలో చేతులతో తేలికపాటి మసాజ్ చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

 

ఇక మీకు పీరియడ్స్ సమయంలో మీ పడకగదిని చాలా ప్రశాంతంగా చల్లగా ఉండేలా చేసుకోవాలి ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు సమతుల్యం అయ్యి ప్రశాంతకరమైన నిద్ర వస్తుంది. ఇలా నిద్రపోవటం వల్ల నొప్పి నుంచి కూడా కాస్త ఉపశమనం పొందవచ్చు.ఇక పీరియడ్స్ సమయంలో కొంత సమయం పాటు యోగా ధ్యానం వంటి వాటిని చేయటం వల్ల ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

 

ఇలాంటి సమయంలో వాకింగ్, ఏరోబిక్, స్ట్రేచింగ్ వంటి వాటిని చేయడం ఎంతో మంచిది.ఇక పీరియడ్స్ సమయంలో వచ్చే వెన్నునొప్పి కడుపు నొప్పి సమస్య నుంచి బయటపడాలి అంటే హీట్ ప్యాడ్ లేదా హాట్ వాటర్ బాటిల్ తో వెనకవైపు పొట్టపై భాగంలో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. పీరియడ్స్ సమయంలో నొప్పి, వికారం, కండరాల తిమ్మిరి సాధారణం. దీని నుండి ఉపశమనం పొందడానికి, మీరు పాలు లేకుండా అల్లం , నల్ల మిరియాలు టీ తీసుకోవచ్చు. ఇది కూడా నొప్పి నుంచి మీకు పూర్తి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -