LakshmiDevi: ఇల్లు సిరి సంపదలతో నిండాలంటే లక్ష్మీదేవికి ఆ పువ్వులతో పూజ చేయాలి!

LakshmiDevi: ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మిదేవి అనుగ్రహం ఉండాలని కోరుకుంటారు. అందుకు సంబంధించిన పూజలు, నియమాలు పాటిస్తుంటారు. లక్ష్మిదేవికి ఇష్టమైన వస్తువులు, ఇతరాత్ర సామగ్రిని ఇళ్లలో పెట్టుకుంటుంటారు. ఆ లక్ష్మిదేవికి ఇష్టమైన వాటిలో తామర పువ్వుకు ఎంతో ప్రాధాణ్యత ఉంది. తామరపువ్వు విష్ణువుమూర్తి చేతిలో ఉండే పుష్పం. అయితే ఈ పువ్వు లక్ష్మీదేవికి ఆసనం.
ఈ పువ్వుకు డబ్బును ఆకర్షించే శక్తి ఉంది. తామర పువ్వుకు మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది. ఈ పువ్వుతో కొన్ని ఉపాయాలు చేస్తే ధనలాభం కలుగుతుందని కొన్ని శాçస్త్రల్లో చెప్పబడింది. ఏకాదశి రోజున శ్రీకష్ణునికి తామర పువ్వులు సమర్పిస్తే త్వరగా సంతానం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

 

లక్ష్మి దేవికి తామర పువ్వు అంటే ఇష్టం. ప్రతి శుక్రవారం తామరపువ్వును లక్ష్మీదేవి పాదాల వద్ద సమర్పించండి. ఇలా ఐదు శుక్రవారాలు వరుసగా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. డబ్బుకు సంబంధించిన ప్రతి సమస్యనూ దీని నుంచి పరిష్కరించుకోవచ్చు. తామర పువ్వును శుభ చిహ్నంగా భావిస్తారు. ఒక వారం పాటు శివలింగంపై తామరçపువ్వ సమర్పించాలి. ఇలా చేస్తే కోరికలన్నీ తీరుతాయి. తామర పువ్వులో నెగటివ్‌ ఎనర్జీని దూరం చేసే గుణం ఉంది. లక్ష్మీదేవికి తామరపువ్వు సమర్పించడంతో ఇంట్లోకి దుష్టశక్తులు దరి చేరవు

 

ఇంట్లో కుటుంబ కలహాలు ఉంటే బుధవారం రోజుతామరపువ్వుకు చందనాన్ని పూసి లక్ష్మీదేవి, గణేశుని పాదాల వద్ద సమర్పించాలి. ఇలా 11 బుధవారాలు పెడితే కుటుంబ కలహాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్య ప్రేమ పెరుగుతుంది. అలాగే, మీరు ప్రతిరోజు తల్లి లక్ష్మి దేవిని పూజించే స్థలంలో తామర పువ్వులు ఉంచాలి. ఇలా చేస్తే సంపద పెరగడంతో పాటు కుటుంబ సభ్యుల అనుబంధం బలపడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -