Jagapathi Babu: జగపతిబాబు మంచి మనస్సు గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

Jagapathi Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆనాటి హీరోల్లో జగపతి బాబు ఓ వెలుగు వెలిగారు. ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతను పొంది చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు. గత నాలుగేళ్ల నుంచి ఆయన సినీ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. జగపతి బాబు తిరిగి విలన్‌గా ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. నటసింహం బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాతో జగపతి బాబు విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చి మరో అడుగు ముందుకేశారు.

లెజెండ్ సినిమాలో విలన్ గా జగపతి బాబు విశ్వరూపం చూపించాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో విలన్ గా హీరో ఫాదర్ గా నటిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే జగపతి బాబు తాను చేసిన సేవా కార్యక్రమాల గురించి పెద్దగా చెప్పుకోరని, చేసిన సాయం గురించి చెప్పుకోవడం ఆయనకు ఇష్టం ఉండదని అందరూ అంటుంటారు. అయితే తాజాగా ఆయన ఓ పేద విద్యార్థికి సాయం చేసి అందరి దగ్గరా ప్రశంసలు అందుకున్నారు.

సైదాబాద్‌కు చెందిన జయలక్ష్మి అనే విద్యార్థికి జగపతి బాబు అండగా నిలిచి సాయాన్ని అందించారు. జయ లక్ష్మి వరల్డ్‌ చిల్ట్రన్స్‌ పార్లమెంట్‌ ప్రధానిగా ఉంటోంది. డిగ్రీ చదువుతూనే సామాజిక సమస్యలపై ఆమె పోరాటం చేస్తూ ఉంది. ఆమెకు సివిల్స్ చదవాలని ఉన్నా ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతోంది. ఆమెను చదివించడానికి ఆమె తల్లిదండ్రులు ఇంటింటికి తిరుగుతూ చెత్త సేకరిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు.

ఈ మధ్యకాలంలో జయలక్ష్మి గురించి ఒక న్యూస్ పేపర్ లో జగపతి బాబు ఆర్టికల్ చదివాడు. జగపతి బాబు తల్లి కోరిక మేరకు ఆయన జయలక్ష్మికి సాయం చేయడానికి ముందుకు వచ్చారు. జయలక్ష్మికి అండగా నిలిచి పూర్తి బాధ్యత తానే తీసుకున్నారు. జయలక్ష్మి సివిల్స్‌ శిక్షణ కోసం అవసరమైన ఆర్థిక సాయాన్ని జగపతి బాబు తెలిపాడు. జగపతి బాబు సాయానికి అందరూ ప్రశంసిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -