Cricket: క్రికెట్ హిస్టరీలో ఈ రికార్డ్ గురించి తెలిస్తే బూతులు తిట్టాల్సిందే!

Cricket: పాకిస్తాన్ క్రికెట్ ఆటగాడు అబ్దుల్లా షఫీక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా ఈయన ఓ సరికొత్త చెత్త రికార్డు సృష్టించారు.అబ్దుల్లా షఫీక్ ఒకటి కాదు రెండు కాదు వరుసగా నాలుగు సార్లు డక్ అవుట్ కావడంతో ఈయన ఒక్కసారిగా వార్తలలో నిలిచారు.ఆదివారం షార్జాలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన 2వ టీ20లో షఫీక్ డకౌట్ అయ్యారు. అంతకుముందు జరిగినటువంటి మ్యాచ్లలో కూడా ఈయన ఇలాగే అవుట్ కావడం గమనార్హం.

 

అలాగే 2020లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచుల్లో రెండుసార్లు డకౌట్ అయ్యాడు. న్యూజిలాండ్ తో జ‌రిగిన 2 టీ20ల్లో రెండో బంతికే డ‌కౌట్ అయిన అత‌ను.. అఫ్ఘాన్ తో తొలి మ్యాచ్ లో 2వ బంతికు, రెండో మ్యాచ్ లో తొలి బంతికే వెనుదిరిగారు. రైట్ హ్యాండ్ బ్యాటర్ గా కొనసాగుతున్నటువంటి అబ్దుల్లా షఫీక్ దాదాపు మూడు సంవత్సరాలు తర్వాత తిరిగి పాక్ జట్టులో స్థానం సంపాదించుకున్నారు.

 

ఇలా మూడు సంవత్సరాల తర్వాత తిరిగి చోటు సంపాదించుకున్నప్పటికీ దానిని కొనసాగించడంలో విఫలమయ్యారని చెప్పాలి. ఇలా ఈయన నాలుగు సార్లు వరుసగా డకౌట్ కావడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదివరకే ఇలా వరుసగా డక్ ఔట్ అయినటువంటి ఇండియన్ క్రికెటర్లు కూడా ఎంతోమంది ఉన్నారు.

 

ఇటీవ‌ల అస్ట్రేలియా వ‌న్డే సిరిస్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ వ‌రుస‌గా మూడు సార్లు గోల్డెన్ డ‌కౌట్ అయిన విష‌యం తెలిసిందే. కేవలం సూర్య కుమార్ యాదవ్ మాత్రమే కాకుండా క్రికెట్ లెజెండ్స్ గా పేరు సంపాదించుకున్న సౌరఫ్ గంగోలి, అనిల్ కుంబ్లే, సచిన్ టెండూల్కర్, భూమ్రా కూడా ఇలాగే వరుసగా డకౌట్ అయినటువంటి వారి జాబితాలో ఉన్నారని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

YCP Candidates: వైసీపీ అభ్యర్థులు అంతా పేదవాళ్లేనా.. అయ్యో ఇంత పేదవాళ్లకు టికెట్లు ఇచ్చారా?

YCP Candidates: పాపం.. వైసీపీ నేతలు అందరు పేదవాళ్లే.. ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. ఇదే మేము అంటున్న మాట కాదండోయ్ వైసీపీ నేతలు వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి చెబుతున్న...
- Advertisement -
- Advertisement -