Kaikala: కైకాల సత్యనారాయణ ఆస్తులు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Kaikala: టాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రాణాలు కోల్పోయారు. ఆయన మణించిన కొద్ది రోజులకే సూపర్‌స్టార్ కృష్ణ మరణించారు. రీసెంట్‌గా మరొక లెజెండరీ నటుడు కన్నుమూశాడు. దీంతో ఇండస్ట్రీ కోలుకోలేని పరిస్థితిలో ఉంది. కైకాల సత్యనారాయణ మరణ వార్తతో ఇండస్ట్రీ మొత్తం షేక్ అయింది. గత కొద్ది రోజులుగా అనారోగ్యం బాధపడుతున్న ఆయన.. ఫిలింనగర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. డిసెంబర్ 23న తెల్లవారుజామున ఈయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. కైకాల సత్యనారాయణ మరణంతో టాలీవుడ్ శోకసంధ్రంలో మునిగింది. టాలీవుడ్ ప్రముఖులు, సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు.

 

 

తాజాగా కైకాల సత్యనారాయణకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. కైకాల సంపాదించిన ఆస్తుల వివరాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. టాలీవుడ్‌లో లెజండరీ యాక్టర్లలో కైకాల సత్యనారాయణ ఒకరు. ఆయన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. మరీ ముఖ్యంగా ఆయన యముడి పాత్రలో చేసిన సీన్స్ బాగా హైలెట్ అయ్యాయి. సినీ కెరీర్‌లో దాదాపు 776 సినిమాల్లో నటించారు. అయితే వయసు పైబడటంతో అనారోగ్యానికి గురయ్యారు. దాంతో సినిమాలకు దూరమయ్యారు. సినిమాల్లో ఉన్నప్పుడే కైకాలా బాగా ఆస్తిని సంపాదించుకున్నట్లు సమాచారం. చెన్నై, హైదరాబాద్‌లో సొంతంగా ఇల్లులు కూడా ఉన్నాయి. అలాగే ఆయన దగ్గర రెండు లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటి ధర ఎంతో ఖరీదైనదిగా చెప్పుకొస్తున్నారు. ఒక కారు ధర రూ.67 లక్షలు, మరో కారు ధర రూ.29 లక్షలు ఉంటుందని సమాచారం. అలాగే కైకాలకు గచ్చిబౌలిలో ఒక ప్లాట్ కూడా ఉందట. దీని ఖరీదు కూడా రూ.1.47 కోట్లు ఉంటుందట. అటు ఇటుగా కైకాల ఆస్తి రూ.30 కోట్లు వరకు ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -