Tarak: తారక్ కొరటాల మూవీ బడ్జెట్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Tarak: టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాల హవా నడుస్తోంది. టాలీవుడ్ నిర్మాతలు బడ్జెట్ విషయంలో తగ్గేదేలే అంటూ ముందుకు సాగుతున్నారు. గతంలో విడుదలైన సినిమాల కలెక్షన్లను బట్టీ సినిమాలపై భారీ పెట్టుబడులు పెడుతున్నారు. హిట్ అయితే డబ్బులు మూటగట్టుకుంటున్నారు. ఫ్లాప్ అయితే మూతులు ముడుచుకుని కూర్చుంటున్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో తాజాగా మరో భారీ బడ్జెట్ సినిమా రూపుదిద్దుకోనుంది.

 

కొరటాల, తారక్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.500 కోట్లు అని తెలుస్తోంది. ఇంటెన్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందనుంది. ఇందులో అలియా భట్ హీరోయిన్ గా ఎంపికైంది. ఆమె ఈ సినిమాకు గాను రూ.20 కోట్లకుపైనే పారితోషికం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్, కొరటాల కూడా ఈ సినిమాకు గాను భారీగానే రెమ్యునరేషన్ ను తీసుకోనున్నారు.

 

మరోవైపు రూ.500 కోట్లతో ఈ సినిమాను రూపొందించడం అంటే మామూలు విషయం కాదు. ఇంత బడ్జెట్ తో సినిమా చేయడం అంటే రిస్క్ అనే కామెంట్లు వస్తున్నాయి. మరోవైపు ఈ సినిమా కోసం ఎన్టీఆర్ 70 రోజుల కాల్షీట్లను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ వంటివారు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

 

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను పాన్ ఇండియా లెవల్లో నిర్మించనున్నారు. కొరటాల శివ ఈ సినిమా స్క్రిప్ట్ కోసం చాలా కష్టపడుతున్నట్లు తెలిపారు. ఆచార్య సినిమా వల్ల విమర్శలను ఎదుర్కొన్న కొరటాల ఆ తప్పు మళ్లీ రాకుండా జాగ్రత్తపడుతున్నాడు. స్క్రిప్ట్ పర్ఫెక్ట్ గా వచ్చే వరకు రాజీ పడకుండా దానిపై వర్క్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం గురించి, రిలీజ్ డేట్ గురించి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే సినిమా మాత్రం టాలీవుడ్ ను ఓ ఊపు ఊపే రేంజ్ లోనే తెరకెక్కనుందని, ఇది పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకులను అలరిస్తుందని కొరటాల పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొస్తూ ఉన్నాడు.

Related Articles

ట్రేండింగ్

Namrata Shirodkar: రోజురోజుకూ మహేష్ భార్య చిన్నపిల్లవుతోంది.. 50 ఏళ్ల వయస్సులో ఇదేం అందమంటూ?

Namrata Shirodkar:  మనకు వయసు పైబడే కొద్ది మన అందం కూడా తగ్గుతుందని చెప్పాలి. ఇలా వయసు పైబడిన కొద్ది అందం కాపాడటం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు కానీ...
- Advertisement -
- Advertisement -