Actress Srivani: సీరియల్ నటి శ్రీవాణి ఇంటి ఖర్చు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Actress Srivani: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్ నటి శ్రీ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది శ్రీవాణి.


తెలుగులో సంఘర్షణ, కలవారి కోడళ్లు, మనసు మమత, ఆతిర, కాంచన గంగ, చంద్రముఖి లాంటి ఎన్నో సీరియల్స్ లో నటించి మెప్పించింది. అంతేకాకుండా టీవీ9 ఈటీవీ అభిరుచి లాంటి షోలకు యాంకర్ గా కూడా వ్యవహరించింది శ్రీవాణి. ప్రస్తుతం కూడా జీ తెలుగు మాటీవీ ఈటీవీ లలో ప్రసారమవుతున్న పలు తెలుగు సీరియల్స్ లో నటిస్తోంది.

 

ఈమె ఎక్కువగా సీరియల్స్ లో విలన్ క్యారెక్టర్లలో నటించి మెప్పించింది. ఇకపోతే శ్రీవాణి భర్త విక్రమాదిత్య, అలాగే కూతురు గురించి మనందరికీ తెలిసిందే. ఇటీవలే శ్రీ వాణి తన భర్త కూతురిని కూడా బుల్లితెర పైకి ఎంట్రీ ఇప్పిచ్చి ప్రేక్షకులకు పరిచయం చేసింది. సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసిన శ్రీవాణి తనకు తన సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఒకవైపు సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు బుల్లితెరపై ప్రచారం అయ్యే పలు ఈవెంట్స్ కి తన భర్తతో కలిసి హాజరవుతూ బాగానే సంపాదిస్తోంది.

 

మరోవైపు యూట్యూబ్ ద్వారా కూడా బాగానే సంపాదిస్తోంది శ్రీ వాణి. ఇది ఇలా ఉంటే తరచూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏదో ఒక వీడియోని షేర్ చేసే శ్రీవాణి తాజాగా తన హోమ్ టూర్ వీడియోని షేర్ చేసింది. ఆ వీడియోలో తన పాత ఇంటిని రీ మోడలింగ్ చేయించినట్లు తెలిపింది. అంతే కాకుండా హౌస్ సెంట్రింగ్ లోనే పల్లెటూరి స్టైల్ లో గుడిసె డిజైన్ చేయించారు. ఆ హోమ్ టూర్ వీడియోలో తన ఇంటిని మొత్తం కూడా పిఓపి అలాగే లైట్ సెట్టింగ్ తో అద్భుతంగా డెకరేషన్ చేశారు. అంతేకాకుండా ఎక్కడ చూసినా కూడా మొక్కలను పెంచుకుంటూ ఇల్లు మొత్తం పచ్చదనంతో నింపేశారు. ఇంట్లో కొన్ని ప్రదేశాలలో టెక్నాలజీని బాగా ఉపయోగించి అత్యాధునిక హంగులు డిజైన్ చేసుకున్నారు.

 

కాగా శ్రీవాణి సొంతింటి కల నెరవేరింది అన్న సంగతి మనందరికీ తెలిసిందే. శ్రీవాణి హోమ్ టూర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ ఇంటికి ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది అన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కాగా శ్రీవాణి ఇండ్లు దాదాపుగా 30 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. చాలా మంది నెటిజన్స్ శ్రీవాణి ఇంటి ఖరీదు తెలిసి నూరేళ్ళ పెడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -