Tarak: తారక్ ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ల జాబితా తెలిస్తే షాకవ్వాల్సిందే!

Tarak: ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ ఈ మధ్య అందర్నీ మెప్పించారు. ఈ సినిమాతో తారక్ నటన అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఆస్కార్ పోటీలోనూ సినిమా నిలిచింది. సినిమా ద్వారా ఇంత క్రేజ్ ను పొందిన తారక్ హీరోయిన్ల విషయంలో మాత్రం అయోమయంలో పడ్డాడు. కొందరు హీరోయిన్లు తారక్ ను రిజెక్ట్ చేయడం షాక్ కు గురిచేస్తోంది.

 

తాజాగా కొరటాల శివతో తారక్ తన 30వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కొంత ఆలస్యం అవుతూ వస్తోంది. చివరికి సినిమా ప్రారంభానికి ముహూర్తం నిర్ణయించారు. ఫిబ్రవరిలో ఈ సినిమాను మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. ఈ మధ్యనే యువసుధ ఆర్ట్స్ నిర్మాణ సంస్థ ఆఫీస్‌ని కూడా ప్రారంభించారు. అందులో కొరటాల సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ కూడా జరుగుతుంది.

 

ఇదిలా ఉంటే ఈ సినిమాకి మరో పెద్ద సమస్య వచ్చిపడింది. ఏడాది కాలంగా ఈ సినిమాలో నటించేందుకు హీరోయిన్లు వరుసగా నో చెప్పడమే ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సినిమాను ఇప్పటి వరకూ ఆరుగురు హీరోయిన్లు రిజెక్ట్ చేసినట్లు సమాచారం. అన్‌ ఆఫీషియల్‌గా మరో ఇద్దరు ముగ్గురు కూడా ఈ వరుసలో ఉన్నారట. ఎన్టీఆర్‌30 సినిమాలో మొదట అలియాభట్‌ హీరోయిన్‌గా అనుకుని ఓకే చేశారు. అయితే ఆమె ప్రెగ్నెన్సీ కారణంగా నో చెప్పింది.

 

కియారా అద్వానీ కూడా ఒప్పుకోలేదనే టాక్‌ వినిపిస్తోంది. దీపికా పదుకొనె ఇప్పటికే ప్రభాస్ తో `ప్రాజెక్ట్ కే` చేయడం వల్ల ఒప్పుకోలేదట. మరోవైపు కీర్తిసురేష్‌ కూడా సినిమాలో చెప్పిన పాత్ర తాను చేయలేనని తేల్చి చెప్పినట్లు సమాచారం. పూజా హెగ్డే పేరు కూడా పరిశీలిస్తే ఆమె కూడా సినిమాకు నో చెప్పిందట. తారక్, కొరటాల కాంబోలో వస్తున్న ఈ సినిమా వాటర్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని సమాచారం. ప్రస్తుతం తారక్ అమెరికా టూర్ లో ఉన్నారు. వెకేషన్ పూర్తి చేసుకుని వచ్చాక సినిమా మొదలు కానుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: ఓటమి భయంతోనే జగన్ కు కోపం.. వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!

Pawan Kalyan: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీ అధినేతలు ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు ఈ క్రమంలోనే కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇటీవల...
- Advertisement -
- Advertisement -