Nani: న్యాచురల్ స్టార్ నాని రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Nani: నాచురల్ స్టార్ నాని తాజాగా దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇలా ఈ సినిమా ఏకంగా 100 కోట్లను రాబట్టడంతో నాని సినీ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా దసరా సినిమా రికార్డులు సృష్టించింది.సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా అన్ని భాషలలోనూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో నాని తదుపరి సినిమాల విషయంలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వరుస అవకాశాలు వస్తున్న నేపథ్యంలో ఈయన వచ్చిన అవకాశాలన్నింటిని అందుకోకుండా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇకపోతే ఒక సినిమా హిట్ అయిన తర్వాత హీరోల క్రేజ్ వారి మార్కెట్ పెరగడం సర్వసాధారణం. అలాగే వారి రెమ్యూనరేషన్ కూడా పెరగడం మనకు తెలిసిందే.

 

ఈ క్రమంలోనే నాని పాన్ ఇండియా స్థాయిలో భారీ సక్సెస్ అందుకోవడంతో ఈయన తదుపరి సినిమాలకు రెమ్యూనరేషన్ భారీగా పెంచారని తెలుస్తుంది. దసరా సినిమా కోసం 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న నాని తన తదుపరి సినిమాకు 22 కోట్ల రూపాయలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా తన తదుపరి సినిమా కోసం ఈయన ఏకంగా రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ పెంచేశారు. ఇక నాని ఇలా డిమాండ్ చేయడంతో నిర్మాతలు కూడా నాని అడిగిన మొత్తంలో రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.

 

నాని సినిమా అంటే మినిమం హిట్ గ్యారంటీ అని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే నానితో సినిమా చేస్తే నష్టపోయేది ఉండదని భావించిన నిర్మాతలు ఆయన అడిగిన స్థాయిలో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఇక నాని తన తదుపరి చిత్రాన్ని వివేక్ ఆత్రేయ అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నానికి జంటగా నటించబోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Minister Jogi Ramesh: మంత్రి జోగి రమేష్ కు భారీ షాక్ తగిలిందా.. సొంత బావమరుదులే ఆయనను ముంచేశారా?

Minister Jogi Ramesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నటువంటి తరుణంలో వైసిపి నాయకులు పెద్ద ఎత్తున సొంత పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు వైసిపి నుంచి...
- Advertisement -
- Advertisement -