Tarak: తారక్ ఆరో వేలి వెనుక కథ తెలిస్తే షాకవ్వాల్సిందే!

Tarak: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన అన్నీ సినిమాలు బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచాయి. ఈయన దర్శకత్వంలో సినిమాలు చేసిన అందరూ హీరోలు స్టార్ హోదాను దక్కించుకున్నారు. అయితే రాజమౌళితో కాకుండా వేరే దర్శకుడితో సినిమాలు చేస్తే మాత్రం.. ఫెయిల్ అవుతున్నారు. ఈ సెంటిమెంట్ మొదటి నుంచి కంటిన్యూ అవుతూ వస్తోంది. ఇలా ఇప్పటివరకు టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోలు ఫెయిల్ అవుతూ వస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోలుగా నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగారు. అయితే వీరిలోనూ భయం పట్టుకొచ్చింది. వేరే డైరెక్టర్లతో సినిమా చేస్తే ఉన్న ఇమేజ్ అవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వేరే డైరెక్టర్‌తో సినిమా ఓకే చేయడానికి ముందు వంద సార్లు ఆచితూచీ అడుగులు వేస్తున్నారు.

 

 

ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ మరీ స్ట్రిక్ట్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకే కథ ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాతో హిట్ కొట్టి.. ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చే సినిమా స్టోరీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాతో హీరో పాత్రకు ఆరు వేళ్లు ఉంటాయట. హీరో ఎప్పుడైతే సీరియస్ అవుతాడో అప్పుడు ఆ ఆరో వేలు బిగుసుకుపోతుందట. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు హీరో ఆరో వేలుకు లింక్ ఉండేలా చూస్తున్నారని, ఆరో వేలినే హైలెట్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తారక్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను ఎంపిక చేయనున్నారు. సంక్రాంతి తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని, 2023లో మూవీ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

 

 

సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేయాలని తారక్-కొరటాల శివ భావిస్తున్నారట. ఎన్టీఆర్ 30 మూవీలో మైథలాజికల్ టచ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో యువసుధ ఆర్ట్స్ ఆఫీస్ ఓపెన్ కాగా.. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో కలిసి సినిమా చేయబోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -