Star Heroine: ఈ స్టార్ హీరోయిన్ నిజస్వరూపం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Star Heroine: ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పదం కాస్టింగ్ కౌచ్. ఇదొక పెద్ద మహమ్మారి అనే చెప్పొచ్చు. ఎన్నో ఆశలతో కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకునేవారికి కాస్టింగ్ కౌచ్ అనేది పెద్ద అవాంతరంగా మారింది. ఈ కాస్టింగ్ కౌచ్ బారిన పడి కొందరు తమ లైఫ్ నే నాశనం చేసేసుకుంటున్నారు. మరికొందరైతే కమిట్ మెంట్లు ఇచ్చేసి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.

 

అయితే ఇప్పుడు అలాంటి కాస్టింగ్‌ కౌచ్‌, కమిట్‌ మెంట్లు గురించి చాలామంది ఓపెన్‌ గానే చెబుతూ షాకుల మీద షాకులు ఇస్తున్నారు. తాజాగా నటి శిరీష కూడా ఈ కాస్టింగ్‌ కౌచ్‌ మీద సంచలన కామెంట్లు చేసి సినీ ఇండస్ట్రీలో అలజడిని రేపారు. శిరీష మాట్లాడుతూ ఇండస్ట్రీలో సినీ పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్ అనేది చాలా కామన్‌ గా మారిపోయిందని తెలిపింది.

 

సినిమాల్లో ఏ చిన్న అవకాశం కావాలని అడిగినా కూడా మాకేంటి అని డైరెక్టుగానే అడుగుతున్నారని ఆమె తెలిపారు. కొందరైతే తాము ఛాన్సులు ఇప్పిస్తామని చెప్పి కొత్తగా వచ్చే యాక్టర్లను బుట్టలో వేసుకుంటున్నారని తెలిపారు. వారు కూడా తమకు కావాల్సింది నేరుగానే అడుగుతున్నారని అన్నారు. తాను కూడా కాస్టింగ్‌ కౌచ్‌ బాధితురాలినేనని, ఛాన్సుల కోసం చాలామందితో పడుకున్నానని శిరీష తెలుపడంతో అందరూ షాక్ అవుతున్నారు.

 

చాలామంది తనతో ఎంజాయ్‌ చేశారని, అయితే ఛాన్సులు ఇప్పించకుండా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు వారంతా మంచి మంచి పొజీషన్‌ లో ఉన్నట్లు తెలిపారు. కానీ తన ఫోన్లు మాత్రం లిఫ్ట్‌ చేయట్లేదని, తనని దారుణంగా వాడుకుని మోసం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. కాస్టింగ్ కౌచ్ వల్ల తానెంత బాధను అనుభవించిందో చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం శిరీష చేసిన ఆరోపణలు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో సునీతకు వరుస షాకులు.. ఏం జరిగిందంటే?

Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దేశం విడిచి వెళ్ళకూడదని, సీబీఐ విచారణకు...
- Advertisement -
- Advertisement -