Kathari Krishna: కఠారి కృష్ణ గురించి ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Kathari Krishna: కఠారి కృష్ణ ఈ పేరు వింటేనే అందరికీ టక్కున క్రాక్ సినిమా గుర్తుకు వస్తుంది. ఈ సినిమాలో కఠారి కృష్ణ పెద్ద ఎత్తున రౌడీయిజం చేస్తూ అడ్డు వచ్చిన వారందరి తలలు నరుకుతూ దండాలు చేసేవారు ఇలా ఈ సినిమాలోని ఈ పాత్రలో నటుడు సముద్రఖని ఎంతో అద్భుతంగా నటించారు. కఠారి కృష్ణ పేరు వినగానే ప్రజలందరూ కూడా ఎంతో భయపడేవారు. ఈ విధంగా

కఠారి కృష్ణపాత్ర ఎంతో అద్భుతంగా ఉందని చెప్పాలి అయితే నిజ జీవితంలో కూడా ఇలాంటి వారు ఉంటారా అంటే ఉంటారని చెప్పాలి.

నిజజీవితంలో కూడా కఠారి కృష్ణ ఉన్నారని ఆయన జీవిత కథ ఆధారంగానే ఆయన చెప్పిన విషయాలను విన్నటువంటి డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ పాత్రను సృష్టించారని తెలుస్తోంది. రియల్ కఠారి కృష్ణ గురించి డైరెక్టర్ గోపీచంద్ పలు విషయాలను తెలియజేశారు. అయితే ఒకప్పుడు అందరి తలలు నరికినటువంటి కఠారి కృష్ణ ఇప్పుడు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారనే విషయాలను ఈయన తెలియచేశారు.

 

ఒంగోలు ప్రాంతంలో 1970 నుంచి 2000 సంవత్సరం వరకు కఠారి కృష్ణ పేరు వింటే జనాలు వణికిపోయేవారు. సత్యం సినిమాలో మాదిరిగానే ఈయన కూడా అడ్డం వచ్చిన వారి తలలను నరికి జైలుకు వెళ్లి వచ్చేవారు ఇక సినిమాలో చూపించిన విధంగానే ఈయనకు రెండో భార్య కూడా ఉన్నారట అయితే తను చనిపోయిన తర్వాత ఈయన రౌడీయిజంలో వెనక్కి తగ్గారని తెలుస్తోంది. ఇక భార్య కూతురు కూడా తన నుంచి దూరం కావడం, తాను చేసిన తప్పులకు జైలు పాలు అయ్యారని తెలుస్తోంది.

 

జైలుకు వెళ్లి వచ్చినటువంటి కఠారి కృష్ణ ప్రస్తుతం ఉల్లిపాయలు అమ్ముకుంటూ గంజి నీళ్లు తాగుతున్నారని ఓ సందర్భంలో గోపీచంద్ మలినేనీ వెల్లడించారు. అయితే చుట్టూ పనివాళ్ళు రౌడీయిజం చేస్తూ బిర్యానీ తింటున్న తనకు సంతోషంగా ఉండేది కాదని ఇప్పుడు ఉల్లిపాయలు అమ్ముతూ గంజి నీళ్లు తాగుతున్న చాలా సంతృప్తిగా సంతోషంగా బ్రతుకుతున్నానని కఠారి కృష్ణ చెప్పినట్లు గోపీచంద్ వెల్లడించారు. ఇలా ఈయన జీవిత కథ ఆధారంగానే క్రాక్ సినిమాలో కఠారి కృష్ణ పాత్రను సృష్టించినట్లు తెలియజేశారు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: భారత్ క్రికెటర్ కంటే వైసీపీ నేత ముఖ్యమా.. పవన్ కళ్యాణ్ విమర్శలు మామూలుగా లేవుగా!

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలపై చాలా ఫోకస్ పెట్టారు అవకాశం దొరికితే చాలు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ...
- Advertisement -
- Advertisement -