Viral: ట్రైన్ లో రెచ్చిపోయిన యువతులు.. అలా డ్యాన్స్ చేస్తూ?

Viral: నేటి యువత పాపులర్ కావటానికి ఎంతగా దిగజారి పోతున్నారు అంటే సమాజాన్ని చుట్టూ ఉన్న పరిసరాల్ని కూడా పట్టించుకోకుండా వెర్రి మొర్రి వేషాలు వేస్తూ వాటిని సోషల్ మీడియాలో పెడుతున్నారు. చేసే వాళ్ళకి ఎలా ఉన్నా చూసేవాళ్ళు మాత్రం తెగ తిట్టుకుంటున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే ఈ మధ్యనే ఒక అమ్మాయిల గ్యాంగ్ ట్రైన్ లో ఒక ట్రెండింగ్ సాంగ్ కు చేసిన డాన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ షార్ట్ ఫిలిం లో యువతుల టీం బీట్స్ కి తగ్గట్టుగా డాన్స్ చేస్తుండడం మనం గమనించవచ్చు. ఇద్దరూ యువతులు అప్పర్బర్తులపై క్రేజీ మూమెంట్స్ ఇవ్వగా మిగిలిన వారందరూ వాళ్లకి అనుకూలంగా స్టెప్స్ వేశారు.

 

ఈ వీడియోని ఇప్పటివరకు 45 వేల మంది చూశారు. ఈ వీడియోని చూసినవారు కొందరు పాజిటివ్గా కామెంట్లు పెడితే మరి కొంతమంది నెగటివ్గా కామెంట్లు పెడుతున్నారు. వీళ్ళకి ఉన్న కాన్ఫిడెన్స్ నాకు లేదు అంటూ ఒక నెటిజన్ కామెంట్ పెట్టడం విశేషం. మరి కొంతమంది ఇలా బహిరంగంగా ఇష్టం వచ్చినట్లు రిలీజ్ చేయటం వల్ల వాళ్లకి ఎలా ఉంటుందో కానీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఇబ్బందులు పడతారు.

 

ముందు మెట్రోలు ఇప్పుడు ట్రైన్ లని టార్గెట్ చేసినట్టుగా ఉన్నారు అంటూ ఒక నెటిజన్ మొహం వాచేటట్లుగా చివాట్లు పెట్టాడు. ఎవరు ఎలాంటి కామెంట్లు పెట్టిన వెర్రి తలకెక్కిన జనాలు వాళ్లకి తోచింది చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇలాంటి రీల్స్ ని విమర్శించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా అంతమంది ఉండటం చెప్పుకోదగ్గ విషయం. అయితే ట్రైన్లలో ఇలాంటివి చేయడం అనేది ప్రమాదకరం కాబట్టి డేంజరస్ రీల్స్ చేసే వాళ్లపై ఈ మధ్యనే అధికారులు కేసులు పెట్టడం ప్రారంభించారు. ఇలాంటి చర్యల వల్ల అయినా యువత ఈ వికృతత్వాన్ని కొంచెం తగ్గించుకుంటుందేమో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ కార్పొరేట్ విద్య అంటే ఇదేనా.. ఏకంగా ఇంత చేశారా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలలను కార్పొరేటర్ విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దామని నాడు నీడలో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా కార్పొరేట్ స్థాయిలో ఉన్నత చదువులు చదువుతున్నారు...
- Advertisement -
- Advertisement -