Heart Attack: గుండెపోటు, పక్షవాతం రావడానికి కారణం స్నానం అలా చేయకపోవడమే నట .. నిజమెంత?

Heart Attack: నేటి కాలంలో వయస్సు భేదం లేకుండా వివిధ రకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయి. అయితే ఒకప్పుడు గుండెపోటు ఆరు పదుల వయస్సు దాటితేనే వచ్చేది. ప్రస్తుతం చిన్న పిల్లలు సైతం గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. సాధారణంగా లెక్కలు వేసుకుంటే 100 మందిలో తక్కువలో తక్కువ 20 కన్నా ఎక్కువే గుండెపోటుకు గురవుతున్నారు. మారుతున్న జీవనశైలితో పాటు పౌషికాహార లోపం పని ఒత్తిడి కారణాల వల్ల హార్ట్‌ ఎటాక్‌ వస్తోందని ఓ పరిశోధనలో వెల్లడైంది.

 

గుండెపోటు రావడానికి స్నానం చేసే పద్ధతి కూడా కారణౖమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సరైన పద్ధతిలో స్నానం చేయకపోవడంతో కూడా గుండెపోటు, పక్షవాతం సైతం వస్తాయట. గుండె జబ్బులు అధిక రక్తపోటు కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతున్న వారు స్నానంచి సరైన పద్ధతిలో చేయాలి. సాధారణంగా చల్లని నీళ్లతో స్నానం చేసినప్పుడు మాత్రమే గుండెపోటు సమస్య వస్తూ ఉంటుంది. స్నానం చేసేటప్పుడు నేరుగా తలపై నీటిని పోయడం వల్ల స్ట్రోక్‌ లేదా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. స్నానం చేయడానికి సరైన మార్గం ఏమిటంటే మొదట కాళ్లపై, ఆ తర్వాత నడుము, మెడ, చివరగా తలపై నీళ్లను పోయాలి. చల్లని నీళ్లను నేరుగా తలపై పోయడం వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరగదు. ముఖ్యంగా నీరు మరీ చల్లగా ఉంటే. అది కేశనాళిక సిరలు కుంచించుకుపోయేలా చేస్తుంది.

 

అలాగే రక్తపోటు కూడా ఉన్నట్టుండి బాగా పెరుగుతుంది. రక్త ప్రసరణ తల నుంచి కాలి వరకు జరుగుతుంది. తలపై చల్లని నీరు పడిన వెంటనే రక్త నాళాలు సంకోచించబడతాయి. దీంతో రక్త ప్రసరణ చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఇది స్టోక్‌తో పాటు హార్ట్‌ ఎటాక్‌ ప్రమాదాన్ని పెంచుతుంది. ఎందుకంటే రక్తం గుండెకు సరిగ్గా చేరదు. కాబట్టి స్నానం చేయడానికి మగ్గును ఉపయోగించి. ముందుగా మీ పాదాలపై నీటిని పోయగా అది నీటి ఉష్ణోగ్రత గురించి శరీరానికి తెలిసేలా చేస్తుంది. నెమ్మదిగా పాదాల తరువాత నీటిని పైకి పోయాలి. చివరగా, మీ తలపై నీటిని పోయండి. ఇది మెదడుకు షాక్‌ ఇవ్వదు. రక్త ప్రసరణ సాధారణంగా ఉంటుంది. ఈ పద్ధతిలోనే స్నానం చేస్తే గుండెపోటు గానీ.. పక్షవాతం బారి నుంచి కాపాడుకోవచ్చని ఇటీవల వెల్లడైన ఓ పరిశోధన ద్వారా తెలిసింది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -