Laxmi Devi Blesses: ఆ మొక్కను అటువైపు నాటితే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందట!

Laxmi Devi Blesses: ఎంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా కూడా ఇంకా చాలా మంది శాస్త్రలు, వాస్తు నమ్ముతూనే ఉంటారు. విజ్ఞన వంటలు సైతం శాస్త్రాల ప్రకారమే కొన్ని పనులు ప్రారంభిస్తుంటారు. ఇంటి నిర్మాణం నుంచి ఇంట్లో పెంచుకునే మొక్కల వరకు ప్రతి ఒక్క విషయంలో వాస్తు శాస్త్రాన్ని పాటిస్తున్నారు. అయితే చాలామంది ఇంట్లో వాస్తు ప్రకారం గా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంట్లో ఆనందాలు అష్టశ్వర్యాలు ఉండాలి అని అనేక రకాల మొక్కలను వాస్తు శాస్త్ర ప్రకారంగా పెంచుతూ ఉంటారు. అలాగే వెదురు మొక్కను కూడా వాస్తు శాస్త్ర ప్రకారంగా పెంచుకోవాలి. ఇంట్లో వెదురు మొక్కను పెంచుకోవడం వల్ల విజయాలు సిద్ధించడంతోపాటు ఆ ఇంట్లోని వారు ఆరోగ్యంగా ఉండి అంతా మంచి జరుగుతుంది. అయితే ఇంటికి తీసుకొచ్చిన వెదురు మొక్కను ఎటువైపు, ఎక్కడ నాటాలో ముందుకు తెలుసుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.

వాస్తు శాస్త్ర ప్రకారం వెదురు మొక్కను నిరంతరం తూర్పు వైపున ఉండాలి. అలా తూర్పు వైపు నాటడంతో ఇంట్లో ఆనందం వెల్లవిరుస్తూ అదృష్టం కూడా వరిస్తోందని శాస్త్రలు చెబుతున్నాయి. వెదురు మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఆ మొక్కను చూసినప్పుడు మనసుకు ఆహ్లాదంగా అనిపించడంతో పాటు అది కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. వాస్తు శాస్త్ర ప్రకారంగా వెదురు మొక్కలు పాజిటివ్‌ ఎనర్జీని తెస్తాయి. ఈ వెదురు మొక్కలను ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార ప్రదేశాలలో తూర్పు వైపున ఉంచడంతో చాలా మంచి జరుగుతుంది. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు అన్న విషయం తెలిసింది. చాలా మంచి ప్రతిరోజు సూర్యునికి ఉదయాన్నే నమస్కారం చేస్తూ ఉంటారు.

అటువంటి వారు వెదురు మొక్కను తూర్పు వైపున నాటడం వల్ల ఆ చెట్టు పచ్చదనాన్ని చూస్తూ మానసికంగా ఆనందాన్ని పొందవచ్చు. అంతేకాకుండా వెదురు మొక్కను తూర్పు వైపున నాటడం వల్ల ఆ ఇంట్లో శాంతి నిలకనడంతో పాటు వివాదాలు జరగకుండా బంధాలు కూడా దగ్గరగానే ఉంటాయి. మరి ముఖ్యంగా ఆఫీసు ప్రదేశాలలో ఈ వెదురు మొక్కను తూర్పు వైపున నాటడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కనిపిస్తాయి. వెదురు చెట్టును తూర్పు వైపు∙నాటడంతో మనం చేసి పనులపై మనం శ్రద్ధ వహించడంతో పాటు మనసుకు ఆహ్లాదకరంగా అనిపించి మనం చేయాల్సిçన పనులన్నీ సక్రమంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Minister Roja: నాడు అప్పులు నేడు కోట్ల రూపాయల ఆస్తులు.. ఆ పనులు చేసి రోజా కోట్లు సంపాదించారా?

Minister Roja: ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి నగరి ఎమ్మెల్యే రోజా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తైన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈసారి కూడా తనను గెలిపించే...
- Advertisement -
- Advertisement -