Temple: ఈ ఆలయాన్ని దర్శించుకుంటే అన్ని కష్టాలు తొలగిపోతాయట.. ఏమైందంటే?

Temple: మన భారత దేశంలో ఎన్నో పురాతన ప్రాచీనమైన దేవాలయాలు ఉన్నాయి. ఇలా ఒక్కో దేవాలయానికి ఒక్కో చరిత్ర కలిగి ఉంది. కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రధాన ఆలయం తిరుపతిలో ఉన్నప్పటికీరెండు తెలుగు రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో కూడా వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి ఉన్నాయని చెప్పాలి. ఇలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాలలో ఘట్‌కేసర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి.

హైదరాబాద్ ఉప్పల్ సర్కిల్ నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఘట్‌కేసర్ కు ముందుగా వచ్చే రింగురోడ్డున ఆనుకొని ఉన్నటువంటి ఈ ఆలయం సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం ఆలయం అని తెలుస్తుంది. ఔరంగజేబు కాలంలో ధ్వంసం కాబడిన ఈ ఆలయం దాతల సహాయంతో తిరిగి పూర్వవైభవాన్ని సంతరించుకుంది. ఇక్కడ ప్రధాన ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారితో పాటు, మహాలక్ష్మి గోదాదేవి రంగనాథ్ స్వామి ధ్రువమూర్తులతో పాటు ఉత్సవ మూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి.

 

ప్రతి ఏడాది జరిగే వైకుంఠ ఏకాదశి రోజు సంక్రాంతి రోజు గోదా కళ్యాణం రోజు ఈ ఆలయంలో పెద్ద ఎత్తున పూజ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ప్రత్యేక దినాలలో భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అలాగే వినాయకుడు అమ్మవారి విగ్రహాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి. దాదాపు రెండు ఎకరాల విస్తీర్ణంలో పచ్చని పొలాలు ప్రకృతి నడుమ ఈ ఆలయం ఉంది.

 

ఎంతో ప్రసిద్ధిగాంచిన పురాతనమైన ఈ ఆలయంలోని స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించి తమ కోరికలను కోరుకోవడం వల్ల తప్పకుండా కోరికలు నెరవేరుతాయని భక్తులు కూడా భావిస్తుంటారు అందుకే ఈ ఆలయానికి భారీ స్థాయిలో ప్రత్యేకమైన రోజులలో భక్తులు చేరుకొని స్వామివారిని ప్రత్యేకంగా పూజించుకుంటారని చెప్పాలి. ఇక శనివారం వంటి రోజులలో కూడా ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది.

 

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -