Pakistan: ముస్లింలు ఎంతో పవిత్రమైన మాసంగా భావించే రంజాన్ నెల ప్రారంభం అయింది. ఈనెల మొత్తం ముస్లిం సోదర సోదరీమణులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలతో నెల మొత్తం నమాజ్ చదువుతూ భక్తి బావంలో ఉంటారు.ఇలా రంజాన్ నెల ప్రారంభం కావడంతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్య ప్రజలు ఒక పూట తినడానికి ఎంతో ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇలా నిత్యవసర వస్తువుల ధరలకు రెక్కలు రావడంతో ప్రజలు కనీస అవసరాలను కూడా తీర్చుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇలాంటి దుర్భరమైన పరిస్థితులు పాకిస్థాన్ లో చోటుచేసుకున్నాయి. ఆర్థిక సంక్షోభంతో కుదేలవుతున్నటువంటి పాకిస్తాన్ లో ప్రస్తుతం రంజాన్ మాసం ప్రారంభం కావడంతో సామాన్య ప్రజలు ఒక పూట తినడం కోసమే ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రస్తుతం నిత్యవసర ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో ప్రతి ఒక్కరికి నిత్యవసర వస్తువులు అందని ద్రాక్ష మాదిరిగా మారిపోయాయి.
ఇక వీరి పరిస్థితులను గుర్తించినటువంటి కొందరు పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఉచిత పంపిణీ కార్యక్రమాలు చేపట్టిన ఆహార పదార్థాల కోసం క్యూ లైన్ లో నిలబడుతూ కొందరు మృత్యువాత కూడా పడుతున్నారు. ఇలా ఆహార పదార్థాలను పంపిణీ చేస్తున్నటువంటి లారీలను సైతం ప్రజలు లూటీ చేస్తున్నారు.ఇలాంటి ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్నటువంటి పాకిస్తాన్ లో నిత్యవసర వస్తువులు ధరలు చూస్తే ఒక్కసారిగా దిమ్మతిరిగిపోతుంది.
పాకిస్తాన్లో ప్రస్తుతం ఒక కిలో ద్రాక్ష కొనుగోలు చేయాలి అంటే 1600 రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.అలాగే ఒక డజన్ అరటి పండ్లు కొనాలి అంటే 500 వరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కిలో బత్తాయి 440 ఉండగా కిలో బియ్యం 340 రూపాయలకు చేరుకుంది. ఇలా ధరలన్నీ కూడా పెరగడంతో పాకిస్థాన్లోని వెరసి ప్రాంత ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అయితే పాకిస్తాన్ లో ఇలాంటి ఆర్థిక సంక్షోభం రావడానికి ప్రధాన కారణం అమెరికా డాలర్ తో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి విలువ మరింత క్షీణించి పోవడమే కారణమని తెలుస్తోంది. దీనికి తోడు ద్రవ్యోల్బణం ఒకవైపు ప్రభుత్వ నిస్సహాయత మరొకవైపు ఇలాంటి పరిస్థితులకు కారణం అయ్యాయి.