Ileana D Croz: ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేస్తున్న ఇలియానా.. తప్పే కదా?

Ileana D Croz: నాజూకైన నడుము చూపిస్తూ.. టాలీవుడ్ ని షేక్ చేసిన సుందరి ఇలియానా. తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో పరిచయం అవసరం లేని పేరు. చిన్న చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ చేసి.. సౌత్ ఇండియా సినీ లోకాన్ని కొన్ని సంవత్సరాలు ఏలింది ఇలియానా. ఒకప్పుడు తన కాల్షీట్ల కోసం క్యూ లైన్లు ఉండేవి. దాదాపు ఒక దశాబ్దం పాటు తన అందాలతో దక్షిణ భారత సినీ లోకంలో తనదైన ముద్ర వేసింది ఇలియానా.

 

సౌత్ ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో ఇలియానా మనసు బాలీవుడ్ వైపు మళ్లింది. కానీ టాలీవుడ్ లో అందుకున్నన్ని విజయాలు అక్కడ లభించలేదు. దానితో ఆఫర్లు కూడా అంతగా రాలేదు. ఆ సమయంలోనే ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ అయిన ఆండ్రూ నిబోన్ తో ప్రేమాయణం నడిపింది. వీరిద్దరూ చాలా కాలం డేటింగ్ లో ఉన్నారు. చెట్టాపట్టాలేసుకు తిరిగిన వీరు.. కలిసి ఎంజాయ్ చేసారు. ఇక ఇలియానా ప్రెగ్నెంట్ ఆంటూ వార్తలు వినిపించాయి. కానీ అవి ఉట్టి పుకార్లే అనే విషయం తర్వాతి రోజుల్లో తేలింది.

 

కొన్ని రోజుల తర్వాత వీరిద్దరూ విడిపోవడంతో.. ఇలియానా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఆ సమయంలో చాలా ఇబ్బంది పడింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇలా ఇబ్బంది పడుతున్న తరుణంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ఇలియానాకు అండగా నిలిచాడు. ఆమెకు ధైర్యం చెబుతూ మళ్ళీ మాములు మనిషిగా మారడంలో సహాయపడ్డాడు. అప్పటికీ అజయ్ దేవగన్ కి పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

 

ఈ సమయంలో ఇలియానా.. అజయ్ చూపించిన కేరింగ్ ను పర్సనల్ గా తీసుకుంది. ఇక అజయ్ కి ఫ్లాట్ అయిపోయింది. దీనితో వారిద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారింది. అప్పట్లో రైడ్, బాద్షాహో వంటి పలు సినిమాల్లో ఇద్దరు కలిసి నటించారు. ఆ చనువు కూడా వీరిద్దరి మధ్య ఎఫైర్ కి కారణం అని వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలపై ఇలియానా, అజయ్ దేవగన్ ఇద్దరు స్పందించలేదు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -