CM KCR: వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి హ్యాట్రిక్ విక్టరీ కొట్టాలని భావిస్తున్న సీఎం కేసీఆర్.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబును బూచిగా చూయించి తెలంగాణ ప్రజల ఓట్లను కేసీఆర్ కొల్లగొట్టారు. ఈ సారి చంద్రబాబు ఏపీలో అధికారం పోవడంలో అక్కడ టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాలను పూర్తిగా వదిలేశారు. దీంతో వచ్చే ఎన్నికల కోసం బీజేపీని శత్రువుగా ప్రజలకు కేసీఆర్ చూపిస్తున్నారు. బీజేపీని టార్గెట్ చేసి ఓటర్లను ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీని కోసం బీజేపీని ఇరుకున పెట్టేలా అనేక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు గులాబీ బాస్. ప్రతి అంశంలో బీజేపీనే టార్గెట్ చేస్తున్నారు.
కానీ ఒక్కొక్కసారి కేసీఆర్ ప్లాన్ లు వర్కౌట్ అవుతుండగా. .ఒక్కొక్కసారి బెడిసికొడుతున్నాయి. ధాన్యం కొనుగళ్ల అంశంలో బీజేపీని ఇరుకున పెట్టాలని కేసీఆర్ చూశారు. కానీ బీజేపీ దీటుగా సమాధానం ఇవ్వడంతో చివరికి కేసీఆర్ తలొగ్గారు. రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. అలాగే తెలంగాణ విలీన దినోత్సవం విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలను జరపాలని నిర్ణయం తీసుకోకగానే… కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ కంటే బీజేపీ త్వరగా నిర్ణయాలు తీసుకుంటోంది. ముందే నిర్ణయాలు తీసుకుని ఎజెండా సెట్ చేస్తోంది. దీంతో బీజేపీ ఎజెండాలోనే కేసీఆర్ కూడా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది.
ప్రతిసారి బీజేపీ చక్రబంధంలోనే కేసీఆర్ చిక్కుకుంటున్నారు. ఇప్పడ రిజర్వేషన్ల అంశంలో కూడా చివరికి కేసీఆర్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెంబర్ 17న ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రకించారు. వారం రోజుల్లో దీనిపై జీవో జారీ చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ బిల్లును ప్రవేశపెట్టి కేంద్రానికి పంపామన్నారు.
కానీ మోదీ బిల్లును ఒకే చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపడం లేదని తెలిపారు. వారం రోజులు టైమ్ ఇస్తున్నారు.. గిరిజన రిజర్వేషన్ పెంపును అంగీకరిస్తావా లేక ఊరేసుకుంటావా అంటూ కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక తాము వేచి చూయలేమని, రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్లను అమలు చేస్తోందని కేసీఆర్ తెలిపారు. కానీ కేసీఆర్ ఇచ్చిన వారం రోజుల గడువు పూర్తైయినా ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి జీవో లేదు. గిరిజన రిజర్వేషన్లపై కేసీఆర్ చర్చలు జరుుతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు. గత మూడు రోజులు మంత్రులతో చర్చలు జరుగుతున్నాయంటున్నారు.
కానీ జీవో ఎప్పుడు వస్తుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. అసలు వస్తుందా.. లేదా అనేది కూడా తెలియడం లేదు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లపై కేసీఆర్ వెనక్కి తగ్గారనే ప్రచారం జరుగుతోంది. న్యాయనిపుణుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. రిజర్వేషన్లను 50 శాతానికి మించి ఇవ్వోద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికే తెలంగాణలో 50 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. గిరిజన రిజర్వేస్ తీసుకొచ్చే రిజర్వేషన్ల సంఖ్య పెరిగే అవకాశముంది. ఇదే జరిగితే ఎవరైనా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఇబ్బందులు న్యాయపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశముంది.
అలాగే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లింలకు 4 నుంచి 12 శాతానికి, గిరిజనులకు 6 నుంచి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచుతు అసెంబ్లీలో తీర్మానం చేశారు. గిరిజనులకు పెంచుతూ జీవో ఇస్తామన్న కేసీఆర్.. ముస్లింల రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు. దీంతో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తుతున్నారు. గిరిజనుల రిజర్వేషన్ జీవో తెస్తే ఓవైసీ ముస్లిం రిజర్వేషన్ పై ఒత్తిడి తెచ్చే అవకాశముంది. ఇదే జరిగితే అన్ని వర్గాల నుంచి డిమాండ్ వచ్చే అవకాశముంది. దీంతో గిరిజన రిజర్వేషన్ల అంశం కేసీఆర్ మెడకు చుట్టుకున్నట్లు అయింది.