Marriage: ఈ లక్షణాలు ఉన్న వారిని పెళ్లికి యాక్సెప్ట్‌ చేయకండి.. ఎందుకంటే!

Marriage: పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటే ఆచితూచి అడుగేస్తారు. ఇద్దరిలో ఓ ఒక్కరూ అర్థం చేసుకోని వారు ఉంటే వారి బంధం ఇక రైలు పట్టాలు లాగా మారిపోతుంది. ఎప్పుడూ వారిద్దరు ఒకటవ్వరు. అందుకే జీవిత భాగస్వామిని ఎంచుకునే ముందు ఆమె లేదా ఆయన అలవాట్లు, లక్షణాలు మనతో పోల్చుకుని సరిపోతాయా లేదా అనేది కుటుంబ సభ్యులతో చర్చించి పెళ్లికి సిద్ధమవ్వాలి.  పెళ్లికి ముందు అలా షికారుకో లేక డేటింక్‌ వెళ్లినప్పుడు అతను ఆమెతో ఉన్నప్పుడు మీకు ప్రశాంతంగా ఉండాలి. కానీ మీతో ఉన్నంత సేపు గాభారపడుతూ, చిన్న విషయానికి అసహనం చూపిస్తూ, మిమ్మల్ని కంగారూ పెట్టిన వ్యక్తిని దూరం పెట్టడమే మంచిది. ఇలాంటి వ్యక్తులకు ఏదీ స్థిరంగా నచ్చదు. ఎదుటివారిలో ఆందోళనను పెంచేస్తారు.

 

 

ముందు చూపు మంచిదే కానీ మరీ ముందు చూపు మాత్రం చికాకు తెప్పిస్తుంది. రేపటి గురించి ఆలోచిస్తే  ఎప్పుడూ అదే ఆలోచనలో కనిపిస్తే నేటి జీవితం సంతోషం లేకుండా గడిచిపోతుంది. వీరు అన్నింటి గురించి ఇలా ఆలోచిస్తారు, ప్రతిది త్వరగా నిర్ణయించేస్తారు. ఇలాంటి వ్యక్తితో మీరు జీవితాంతం కలిసి ఉండగలరో లేదో మీరే నిర్ణయించుకోవాలి. తన గురించి మాత్రమే ఆలోచించుకునే స్వార్ధపరుడిని పెళ్లిచేసుకుంటే చాలా కష్టం భాగస్వామి గురించి వీళ్లు తక్కువ ఆలోచిస్తారు. అన్నీ తమకు నచ్చినవే చేస్తారు. ఎదుటివారి భావాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయరు మీతో మాట్లాడేటప్పుడు ఎప్పుడూ తన గురించే మాట్లాడేవ్యక్తిని ఎన్నుకోకపోవడం ఎంతో మంచిది.

 

 

 

కాబోయే భాగస్వామి మీతో ప్రతిసారి నీతి వాఖ్యాలు చెబుతూ.. ప్రగల్భాలు పలుకుతుంటే అతను లేదా ఆమెను భరించడం కష్టం. జీవితాంతం నీతులు చెబుతూ విమర్శిస్తూనే ఉంటారని కూడా అర్థం చేసుకోవాలి. ‘నేనెప్పుడూ తప్పు చేయను’ అంటూ గొప్పలు చెప్పుకునే వ్యక్తితో జీవించడం చాలా కష్టం. ఏ వ్యక్తి తప్పు చేయకుండా ఉండదు. అతను తప్పు చేసినప్పుడు మీరు ఆ విషయాన్ని ఎత్తి చూసినా పెద్ద రాద్ధాంతం చేస్తారు. ఇది ముందస్తుగా మీరు గమనించుకోవాలి. భాగస్వామి ఎలా ఉన్నా మనస్ఫూర్తిగా స్వీకరిస్తేనే ఆ బంధం నిలుస్తుంది. అలా కాకుండా విమర్శిస్తూ ఉంటే ఎప్పటికే దారంలా తెగిపోతుంది. మీరు పెళ్లికి ముందు మాట్లాడుతున్నప్పుడు విమర్శించే వ్యక్తా కాదా అనేది గ్రహించాలి. నీ డ్రెస్సేంటి ఇలా ఉంది.. జడ మరలా వేసుకోవచ్చు కదా.. నీకు ఎప్పటికీ వంట చేయడం రాదేమో? ఇలాంటి వ్యాఖ్యలే చేస్తారు పెళ్లికి ముందు. కానీ ప్రతి చిన్న విషయానికి విమర్శించడం మొదలైతే పెళ్లయ్యాక అవి చాలా పెద్ద విమర్శులుగా మారుతాయి. కాబట్టి అలాంటి లక్షణాలు కనిపిస్తే దూరంగా ఉండడమే ఎంతో బెటర్.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -