Munugode By-Poll: పార్టీలకు క్రాస్ ఓటింగ్ భయం.. మునుగోడులో ఎవరికి ప్లస్? ఎవరికి మైనస్?

Munugode By-Poll: మునుగోడు ఉపఎన్నికలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. విజయ బావుటా ఎవరు ఎగురేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. పార్టీలన్ని ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తీవ్రంగా గెలుపు కోసం ప్రయత్నిస్తున్నాయి. జోరుగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తోన్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నెలకొనన క్రమంలో గెలుపు ఎవరనేది తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రజల్లో కూడా దీనిపై ఆసక్తి నెలకింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో.. మునుగోడు ఉపఎన్నికపై జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది.

అయితే మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ తో పాటు చిన్న పార్టీలు కూడా పోటీ చేయడంతో ఓట్లు భారీగా చీలనున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడం వల్ల ఎవరికి లాభం.. ఎవరికి నష్టం జరుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది. చిన్న పార్టీల వల్ల కాంగ్రెస్, బీజేపీకి బాగా నష్టం జరిగే అవకాశముందని అంటున్నారు. క్రాస్ ఓటింగ్ భయం పార్టీలను వెంటాడుతోంది. మొత్తం 47 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తుండగా.. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులను మనిహాయిస్తే 44 మంది పోటీలో ఉన్నారు. ఈ 44 మంది అభ్యర్థులు ప్రధాన పార్టీలను భయపెడుతున్నారు.

ఇక సైలెంట్ ఓటింగ్ ఎంతోకోంత ఉంటుంది. ఎన్నికల వరకు వీరి మూడ్ ఎటువైపు ఉంటుందో ఎవరూ అంచనా వేయలేరు. గెలపులో ఈ సైలెంట్ ఓటర్లు కీలక పాత్ర పోషిస్తారు. ఎన్నికల్లో అంచనాలు తారుమారు కావడానికి ఈ సైలెంట్ ఓటర్లదే ముఖ్యపాత్ర ఉంటుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లడం ద్వారా కొంతమంది క్యాడర్, కార్యకర్తలు ఆయనతో పాటు వెళ్లారనే ప్రచారం ఉంది. కానీ రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లినా.. కాంగ్రెస్ క్యాడర్ ఆయన వెంట వెళ్లలేదని, తమ వెంటే ఉన్నారని కాంగ్రెస్ అభ్యర్ధి స్రవంతి రెడ్డి చెబుతున్నారు.

అలాగే టీఆర్ఎస్ వామపక్షాల ఓట్లపై ఆశలు పెట్టుకుంది. మునుగోడులో గతంలో 4 సార్లు లెఫ్ట్ పార్టీల నేతలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీనిని బట్టి చూస్తే మునుగోడు నియోజకవర్గంలో ఎర్ర పార్టీలకు కాస్త బలంగా ఉందని తెలుస్తోంది. దాదాపు 25 వేల మంది లెఫ్ట్ పార్టీల ఓటర్లు ఉన్నారు. దీంతో ఈ ఓటర్లలో ఎంతమంది టీఆర్ఎస్ కు వేస్తారనేది కీలకంగా మారింది. వారందరూ గంపగుత్తగా తమ పార్టీకి వేస్తారని టీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. వారితో ఎంతమంది వేస్తారనేది తెలియడం లేదు. ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎవరికి ఎక్కువ పడతాయనేది ఎవరు అంచనా వేయలేకపోతన్నారు. బీజేపీకి వెళతాయా.. లేదా కాంగ్రెస్ కు వెళతాయనేది కూడా చర్చనీయాంశంగా మారింది.

మునుగోడులో బీసీ ఓటర్లు కీలకంగా మారాయి. ఆ నియోజకవర్గంలో దాదాపు 70 శాతం మంది ఓటర్లు బీసీ సామాజికవర్గానికి చెందినవారే. కానీ రాజకీయంగా రెడ్డి సామాజికవర్గం ఆధిప్యతమే కొనసాుగతోంది. పార్టీలన్నీ రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలకే టికెట్లు కేాయించాయి. దీంతో రెడ్డి వర్సెస్ రెడ్డి వార్ మునుగోడులో జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఒకసారి పనిచేశారు. స్రవంతి రెడ్డి గతంలో పలుమార్లు పోటీ చేసినా ఓడిపోయారు. దీంతో గెలుపు ఎవరు సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -