Ramiz: క్రికెట్‌లో ఇండియా పవర్‌ఫుల్.. అయినంత మాత్రాన మేం సేవకులమా?: రమీజ్

Ramiz: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ పదవి నుంచి రమీజ్ రాజాను తొలగించారు. అయినా సరే భారత్ ను విమర్శించడానికి ఏమాత్రం అవకాశం దొరికినా ఆయన వదులుకోవడం లేదు. టీమిండియా కెప్టెన్ కూడా తమ వల్లే మారాడంటూ మరోసారి అక్కసు వెళ్లగక్కాడాయన. తాజాగా ఇండియాకు సర్వెంట్లుగా పనిచేయడం లేదని చెబుతూ మరో వివాదానికి కారణభూతం అయ్యాడు. అసలు రమీజ్ రాజా ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశాడంటే..?

 

బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రెసిడెంట్ జై షా గతంలో పాకిస్థాన్ వేదికగా జరిగే ఆసియా కప్ 2023లో తాము ఆడేది లేదని స్పష్టం చేశాడు. తటస్థ వేదికల్లో అయితేనే దాయాదితో తాము మ్యాచ్ ఆడతామన్నాడు. అప్పుడు పీసీబీ (రమీజ్ రాజా నేపథ్యంలోని) కూడా భారత్ లో జరిగే వన్డే ప్రపంచకప్ లో తమ జట్టు కూడా ఆడదంటూ అల్టిమేటం జారీ చేసింది. ఇప్పుడు పీసీబీకి కొత్త చైర్మన్ గా వచ్చిన నజామ్ సేథీ కూడా ఇదే విషయంపై గట్టిగా నిలబడాలని రమీజ్ డిమాండ్ చేస్తున్నాడు. అలాగే ఏసీసీ బోర్డును సమావేశపర్చి నిర్ణయం తీసుకోవాలని చెప్పాడు.

 

వాళ్లు ఏం చెబితే అది వినాలా?: రమీజ్
‘ఇదేం నాయకత్వం? ఏసీసీ బోర్డును అత్యవసరంగా సమావేశపర్చాలి. ఆసియా కప్ టోర్నీకి అతిథ్యం ఇవ్వాలని మమ్మల్ని ఏసీసీ కోరింది. ఇప్పుడేమో పాక్ లో అయితే తాము టోర్నీ ఆడబోమని భారత్ అభ్యంతరాలు చెబుతోంది. తటస్థ వేదికకు మార్చాలని మొరాయిస్తోంది. దీనిపై అసలు ఏసీసీ స్పందన ఏంటి? ప్రపంచ క్రికెట్ లో శక్తిమంతమైన ఇండియాకు మేం సేవకులమా? వాళ్లు ఏం చెబితే అది మేం వినాలా?’ అని రమీజ్ రాజా ప్రశ్నించాడు.

 

కచ్చితంగా పాకిస్థాన్ వేదికగా ఆసియా కప్ ను నిర్వహించాల్సిందేనని రమీజ్ రాజా స్పష్టం చేశాడు. అందుకోసం కావాల్సివస్తే ప్రభుత్వంతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. ప్రస్తుతం పాక్ క్రికెట్ ఎంతో ఉన్నత స్థాయిలో ఉందని.. జట్టులో సూపర్ స్టార్లు ఉన్నారని రమీజ్ పేర్కొన్నాడు. తమ ప్లేయర్లకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని.. కాబట్టి టీమ్ కు మర్యాద ఇవ్వాలని వివరించాడు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -