India T20: నేడు భారత్-శ్రీలంక రెండో టీ20.. మనోళ్లు సిరీస్ పట్టేస్తారా?

India T20శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈరోజు పూణె వేదికగా రెండో టీ20 జరగనుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టీ20లో మెరుగైన ప్రదర్శన చేయకపోయినా ఈ మ్యాచ్‌లో టీమిండియానే ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. అయితే జట్టులో పలు మార్పులు చేయడం తథ్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే గాయం కారణంగా సంజు శాంసన్ దూరమైన నేపథ్యంలో అతడి స్థానంలో రాహుల్ త్రిపాఠి లేదా రజత్ పటీదార్‌లకు అవకాశం రానుంది.

 

శ్రీలంకపై విజయం అంత సులభం కాదని తొలి టీ20లో భారత ఆటగాళ్లకు అర్ధమయ్యే ఉంటుంది. అందుకే రెండో టీ20లో పక్కా వ్యూహాలతో ఆ జట్టును ఓడించాల్సి ఉంది. బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేయకుంటే తొలి టీ20లో భారత్ ఓటమి పాలయ్యేది. పూణె పిచ్ కూడా స్పిన్‌కు అనుకూలిస్తుందని.. ఈ మ్యాచ్‌లోనూ స్పిన్నర్లు ప్రభావం చూపుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌పై వేటు వేస్తారా లేదంటే కొనసాగిస్తారా అన్న అంశం ఆసక్తి రేపుతోంది. తొలి టీ20లో అతడు నెమ్మదిగా ఆడటం విమర్శలకు తావిచ్చింది. ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన అతడు 7పరుగులకే అవుటై తీవ్రంగా నిరాశపరిచాడు. స్ట్రైక్ రేటు కూడా చెత్తగా ఉంది. దీంతో రెండో టీ20లో గిల్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం కల్పించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మీద సెంచరీలు బాదిన గైక్వాడ్‌ను పక్కనపెట్టడం సబబు కాదని సూచిస్తున్నారు.

 

హర్షల్ పటేల్ అవుట్?
శ్రీలంకతో రెండో టీ20లో హర్షల్ పటేల్‌ను తొలగించి అతడి స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి మ్యాచ్‌లో రాణించిన శివం మావి, ఉమ్రాన్ మాలిక్‌లను కొనసాగించనున్నారు. అయితే ధారాళంగా పరుగులు సమర్పించుకున్న అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తీసుకునే అవకాశాలు లేకపోలేదు. ఏదేమైనా పూణెలోనే భారత్ సిరీస్ పట్టేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -