Under19: U19 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు

Under19: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్నఅండర్ 19 ప్రపంచకప్‌లో భారత అమ్మాయిలు అదరగొడుతున్నారు. ఈ మెగా టోర్నీలు భారత్ వరుసగా రెండో విజయం సాధించి సూపర్-6కు అర్హత సాధించింది. సోమవారం గ్రూప్-డిలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో జరిగిన మ్యాచ్‌లో 122 పరుగుల భారీ తేడాతో భారత్ సూపర్ విక్టరీ సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. అండర్ 19 మహిళల ప్రపంచకప్‌లో 200 పరుగులు చేసిన తొలి జట్టుగా భారత్ నిలిచింది.

 

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది. టీమిండియా బ్యాటర్లలో షఫాలీ వర్మ 34 బంతుల్లో 78, శ్వేత 49 బంతుల్లో 74 పరుగులు, రిచా ఘోష్ 29 బంతుల్లో 49 పరుగులు చేశారు. యూఏఈ బౌలర్లలో ఇందూజ, మహిక, సమైర తలో ఒక వికెట్ సాధించారు.

 

అటు 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ జట్టు 20 ఓవర్లలో కేవలం 5 వికెట్ల నష్టానికి 97 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆలౌట్ కాకూడదనే లక్ష్యంతో ఆ జట్టు చివరి వరకు బ్యాటింగ్ చేసింది. షఫాలీ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. బౌలింగ్‌లోనూ షఫాలీ వర్మ రాణించింది. రెండు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చింది. షబ్నామ్, సధు, కశ్యప్, చోప్రా తలో వికెట్ సాధించారు.

 

దంచికొట్టిన భారత ఓపెనర్లు
యూఏఈ కెప్టెన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తాను తీసుకున్న నిర్ణయం ఎంత తప్పో తెలిసేందుకు ఆమెకు ఎక్కువ సేపు పట్టలేదు. ఓపెనర్లుగా శ్వేత, షఫాలీ వర్మ క్రీజులోకి వచ్చీ రావడంతోనే యూఏఈ బౌలర్లపై విరుచుకుపడ్డారు. తనను లేడీ సెహ్వాగ్ అని ఎందుకు అంటారో మరోసారి షఫాలీ వర్మ చాటి చెప్పింది. ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో వరుసగా రెండు మెరుపు సిక్సర్లు కొట్టింది. ఇదే ఊపులో సెంచరీ చేసేలా కనిపించిన షఫాలీ 78 పరుగుల వద్ద అవుటైంది.

Related Articles

ట్రేండింగ్

Nandyal: మా జీవితాలను మీరే నాశనం చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే భార్యకు భారీ షాక్ తగిలిందా?

Nandyal: ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో నామినేషన్ ప్రక్రియలు కూడా చాలా వేగవంతంగా జరిగాయి. ఇక నేటితో నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. ఇక నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ కూడా...
- Advertisement -
- Advertisement -