Vijay Antony: ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న విజయ్ ఆంటోనీ!

Vijay Antony: టాలీవుడ్ ప్రేక్షకులకు బిచ్చగాడు సినిమాలో హీరోగా నటించిన విజయ్ ఆంటోని గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆ సినిమాతో విజయ్ స్టోరీ పరంగా తెలుగు ప్రేక్షకులకు మరో స్థాయిలో కనెక్ట్ అయ్యాడు. ఇతడు కేవలం హీరో గానే కాకుండా తమిళం ఫిలిం ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా చాలా సినిమాల్లో పని చేశాడు.

నాన్, సలీం సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. ఆ తర్వాత వచ్చిన బిచ్చగాడు సినిమాతో ప్రేక్షకులను మరో లెవెల్లో ఆకట్టుకున్నాడు. ఎంతలా అంటే బిచ్చగాడు సినిమాతో విజయ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే విజయ్ ఆంటోనీ పర్సనల్ లైఫ్ గురించి చాలామందికి తెలియదు. ప్రస్తుతం విజయ్ భార్య ఎవరు? వాళ్ళిద్దరు పెళ్లి ఎలా జరిగింది అన్న విషయాలు తెలుసుకుందాం.

ఫాతిమా అనే ఒక జర్నలిస్టును విజయ్ ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఫాతిమా అనే జర్నలిస్ట్ మొదట విజయ్ ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిందట. ఆ పరిచయం కాస్త వీరిద్దరూ ప్రేమలో పడి 2006లో ప్రేమ వివాహం జరుపుకున్నారు. వీరిద్దరికీ లారా అనే కూతురు కూడా పుట్టింది. ఇక విజయ్ మాత్రం జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడట. విజయ్ తండ్రి తన చిన్న వయసులోనే చనిపోయాడట.

సరిగ్గా విజయ్ కి ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు అతని తండ్రి మరణించాడట. ఇక తన చెల్లికి నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉన్నాయట. ఇక విజయ్ తల్లి ఉద్యోగం చేస్తూ పిల్లలని చదివించేదట. ఇక విజయ్ అంటోని చదువులో బాగా టాపర్. అతడు తన చదువును చెన్నైలో పూర్తిచేసి సౌండ్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ అయ్యాడట. ఇక తన తల్లి ఉద్యోగ నేపథ్యంలో ట్రైనింగ్ కి వెళ్లాల్సి వస్తే విజయ్ హాస్టల్స్ లో గడిపేవాడు అట. అలా కెరీర్ లో ఎన్నో కష్టాలు పడ్డ విజయ్ ప్రస్తుతం స్టార్ హీరోగా హడావిడి చేస్తున్నాడు.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -