iPhone: ఐఫోన్ SE కంటే ఐఫోన్ తక్కువ ధరకే ఐఫోన్ 14.. ధర ఫీచర్లు ఇవే?

iPhone: దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా యాపిల్ సంస్థకి ఉన్న క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. యాపిల్ లో ముఖ్యంగా ఐఫోన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలామంది ఐఫోన్ ని ఒక్కసారైనా వినియోగించాలని అనుకుంటూ ఉంటారు. కానీ వాటి ధర కారణంగా చాలామంది ఆ ఆశను నెరవేర్చుకోలేకపోతూ ఉంటారు. ఇది ఇలా ఉంటే ఐఫోన్ ప్రియులకు ఒక గుడ్ న్యూస్. అదేమిటంటే యాపిల్‌ ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ.79,900 కాగా దీనిని 2023 నూతన సంవత్సరం సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్‌ అందిస్తోంది. అయితే స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.32,901 డిస్కౌంట్‌తో కేవలం రూ.46,990కే లభిస్తోంది.

 

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే..
ఐఫోన్‌ 14 ఇటీవల లాంచ్‌ అయిన యాపిల్‌ ఐఫోన్‌ 14 సిరీస్‌లో బేస్ మోడల్. అయితే ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 13 డిజైన్‌ పోలి ఉంటుంది. కానీ మెరుగైన ప్రాసెసర్, కొన్ని కొత్త ఫీచర్స్‌ను అందిస్తోంది. యాపిల్‌ ఐఫోన్‌ 14 సిరీస్‌లో ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 14 ప్లస్‌, ఐఫోన్‌ 14 ప్రో, ఐఫోన్‌ 24 ప్రో మ్యాక్స్‌ అనే నాలుగు మోడల్స్ ని విడుదల చేసింది యాపిల్ సంస్థ. ఐఫోన్ 14 లైనప్‌లో బేస్ మోడల్ కావడంతో మిగతా వాటి కంటే తక్కువ ధరకు లభిస్తోంది. 128జీబీ స్టోరేజ్‌తో ఐఫోన్ 14 బేస్ మోడ్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.5910 తగ్గింపుతో రూ.73,990కి లిస్ట్‌ అయింది. దీంతోపాటుగా కొనుగోలుదారులు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ EMI ట్రాన్సాక్షన్‌లపై రూ.4,000 ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ను అందిస్తోంది.

 

దాంతో స్మార్ట్‌ఫోన్ ధర రూ.69,990కి తగ్గుతుంది. అలాగే ఈ కామర్స్ ప్లాట్‌ఫారమ్ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేయడం ద్వారా రూ.23,000 వరకు డిస్కౌంట్‌ అందుకునే అవకాశం కల్పిస్తోంది. అంటే అన్ని బ్యాంక్ ఆఫర్‌లు, డిస్కౌంట్‌లతో ఐఫోన్‌ 14ని ఫ్లిప్‌కార్ట్ నుంచి కేవలం రూ.46,990కి సొంతం చేసుకోవచ్చు. ఇకపోతూ ఐఫోన్‌ 14 స్పెసిఫికేషన్స్‌ విషయానికి వస్తే.. యాపిల్‌ ఐఫోన్‌ 14 6.1 అంగుళాల స్క్రీన్‌తో లభిస్తోంది. సూపర్ రెటినా XDR OLED స్క్రీన్‌, 1200 నిట్స్ పీక్ HDR బ్రైట్‌నెస్, డాల్బీ విజన్‌ అందిస్తుంది. ఈ డివైజ్‌ A15 బయోనిక్ చిప్‌సెట్‌, iOS 16 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో రన్‌ అవుతుంది. 12ఎంపీ ప్రైమరీ లెన్స్ అందుబాటులో ఉంది. లో లైట్‌ పెర్‌ఫార్మెన్స్‌ కోసం f/1.9 అపర్చర్‌తో కొత్త 12ఎంపీ ఫ్రంట్ ట్రూడెప్త్ కెమెరాతో లభించనుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: ఓటమి భయంతోనే జగన్ కు కోపం.. వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!

Pawan Kalyan: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీ అధినేతలు ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు ఈ క్రమంలోనే కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇటీవల...
- Advertisement -
- Advertisement -