Character: అబ్బాయిది అలాంటి క్యారెక్టరా.. అమ్మాయిని ఎవరైనా అలా అడుగుతారా?

Character: సాధారణంగా పెళ్లిచూపులు అంటేనే ఎంతో హడావిడి ఉంటుంది. ముక్కు ముఖం తెలియని అబ్బాయి తమని చూడటానికి వస్తున్నారని తెలిసి ఆ అమ్మాయి అబ్బాయి గురించి ఎన్నో ప్రశ్నలను తనకు తానే ప్రశ్నించుకుంటుంది. ఇక పెళ్లి చూపులకు వచ్చినవారు అమ్మాయిలను ఎన్నో రకాల ప్రశ్నలు అడగడం మనం చూస్తుంటాము.ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. కనుక వారి ఉద్యోగానికి సంబంధించిన విషయాలను అబ్బాయిలు అడిగి తెలుసుకుంటారు.

ఇకపోతే కొందరు ఈ మధ్యకాలంలో అమ్మాయిలను ప్రశ్నించడం చాలా ఫ్యాషన్ గా మారిపోయింది. అయితే మారిన కల్చర్ ఆధారంగా అలాంటి ప్రశ్నలు వేస్తున్నారా లేక వారి చుట్టూ ఉండే స్నేహితుల వల్ల ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు తెలియదు కానీ అబ్బాయిలు అడిగే ప్రశ్నలు కారణంగా అమ్మాయిలు అబ్బాయిల పట్ల తప్పుగా ఆలోచించడమే కాకుండా పెళ్లి అంటేనే విసుగు చెందేలా అబ్బాయిలు ప్రవర్తిస్తున్నారు.

 

తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.అందమైన జీవితం అనే కార్యక్రమంలో భాగంగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఒక అబ్బాయి అమ్మాయికి పెళ్లి కుదిరిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారట అయితే అందుకు కారణాలను ఈ కార్యక్రమంలో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అమ్మాయిని ఎందుకు పెళ్లి క్యాన్సిల్ చేశారు అంటూ ఈ కార్యక్రమం ద్వారా అబ్బాయి అడిగి తెలుసుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే డాక్టర్ అమ్మాయికి ఫోన్ చేసి ఎందుకు పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించగా ఆ అమ్మాయి చెప్పిన సమాధానాలు విని ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.

 

సాధారణంగా పెళ్లి చూపులకు వచ్చిన తర్వాత అబ్బాయి అమ్మాయి గురించి తెలుసుకోవడం అమ్మాయి అబ్బాయి గురించి తెలుసుకోవడం సర్వసాధారణం అయితే ఈ అబ్బాయి మాత్రం కాస్త హద్దులు దాటి సంస్కారాన్ని మర్చిపోయి తన పట్ల ప్రవర్తించారని సదరు అమ్మాయి తెలియజేసింది. ఇంతకీ ఆ అబ్బాయి ఎలాంటి ప్రశ్న వేశారు అనే విషయానికి వస్తే తన పర్సనల్ విషయాలు గురించి మాట్లాడుతూ ఆ అబ్బాయి ఏకంగా ఆర్ యు వర్జిన్ అనే ప్రశ్న వేశారంటూ అమ్మాయి కన్నీరు మున్నీరయ్యారు. ఒక అబ్బాయి తనకు కాబోయే భార్యను అడగాల్సిన ప్రశ్న ఇదేనా అంటూ ప్రశ్నించారు. పెళ్లికి ముందే ఇలాంటి ప్రశ్న వేసిన అతను రేపు పొద్దున పెళ్లయిన తర్వాత నేను ఎవరితో మాట్లాడిన సందేహిస్తారన్న అనుమానంతోనే తాను ఈ పెళ్లి క్యాన్సిల్ చేశాను అంటూ ఆ అమ్మాయి చెప్పడం విశేషం.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -