Adivi Sesh: ఆరోజే అడివి శేష్ సుప్రియ పెళ్లి చేసుకోనున్నారా.. ఏమైందంటే?

Adivi Sesh: టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అడవి శేష్ కి తెలుగులో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. అడవి శేష్ కేవలం హీరోగా మాత్రమే కాదు. యాక్టర్గా, డైరెక్టర్ గా, స్క్రీన్ రైటర్ గా ఇలా అన్ని రంగాల్లోను తనదైన శైలిలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచు కున్నాడు. చాలా సినిమాలలో హీరోగా నటిచడంతో పాటు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు.

కాగా మొదట పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమాలో విలన్ గా నటించిన అడవి శేష్ తరువాత బలుపు, దొంగాట, బాహుబలి వంటి సినిమాల్లో నెగటివ్ రోల్స్ లో నటించి మరింత పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇక శర్వానంద్ హీరో గా నటించిన రన్ రాజా రన్ లో సెకండ్ హీరో గా నటించిన అడవి శేష్ క్షణం చిత్రం ద్వారా హీరో గా ఆడియన్స్ ని పలకరించాడు.ఆ తర్వాత గూడాచారి,ఎవరు, అమీ తుమీ, మేజర్ మరియు హిట్ : ది సెకండ్ కేసు వంటి చిత్రాల్లో హీరో గా నటించాడు. కాగా ప్రస్తుతం అడవి శేష్ గూఢచారి 2 చిత్రం షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు.ఇది ఇలా ఉంటే గత కొంతకాలంగా అడవి శేష్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

 

అదేమిటంటే హీరో అడవి శేషు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా హీరోయిన్ సుప్రియ తో గత కొంతకాలంగా డేటింగ్ లో మునిగితేలుతున్నాడు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడని కూడా తెలుస్తోంది. కాగా
సుప్రియ స్వయానా అక్కినేని నాగేశ్వర రావు గారి మనవరాలు, సుమంత్ కి చెల్లెలు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో ఆ సినిమా చేసిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. కానీ అన్నపూర్ణ స్టూడియోస్ కార్యకలాపాలు మొత్తం సుప్రియానే దగ్గరుండి చూసుకుంటోంది. కాగా ఈమె అడవి శేష్ హీరోగా నటించిన గూడాచారి అనే చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆమె అడవి శేష్ కి చాలా దగ్గర అయ్యింది. తక్కువ సమయం లోనే మంచి స్నేహితులై ఆ తర్వాత ప్రేమలో కూడా పడ్డారట. అయితే ఈ వార్తలపై గతం అడవి శేష్ స్పందించి అలాంటిదేమి లేదని కొట్టిపారేసినా, వీళ్ళు తరచూ ప్రైవేట్ పార్టీలకు పబ్బులకు వెళ్తూ ఉండడం, కలిసి తిరగడం , టూర్స్ కి వెళ్లడం వంటివి సోషల్ మీడియాలో ఫోటోలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -