Allu Arjun: అల్లు అర్జున్ నో చెప్పడమే ఆ సినిమాకు ప్లస్ అయిందా?

Allu Arjun: మామూలుగా కొందరు హీరోలు వచ్చినా కథలన్నీ వెంట వెంటనే యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. ఆ కథలో తమ పాత్ర ఎటువంటిది అనేది గమనించకుండా వచ్చిన సినిమాలు చేసుకుంటూ పోతారు. దీంతో వారి కెరీర్ త్వరగా ముగిసిపోతుంది. పాత్ర గురించి పూర్తిగా తెలియకుండా ఏదైనా సినిమా చేస్తే తర్వాత సినిమాకు వెళ్లే స్కోప్ ఉండదు. ఒకవేళ ఆ సినిమా సక్సెస్ అయితే సరే. ఒకవేళ సక్సెస్ కాకపోతే అంతే సంగతి.

అందుకే స్టార్ హీరోలు సినిమా విషయంలో బాగా జాగ్రత్త పడుతూ ఉంటారు. ముఖ్యంగా తమ పాత్రలను ఎంచుకునే విధంగా అసలు తొందరపడరు. ఒకవేళ తొందరపడి పాత్ర ఓకే చేస్తే ఫ్యాన్స్ అసంతృప్తికి గురవుతారు. అంతేకాకుండా వారి ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతుంది. అందుకే స్టార్ హీరోలు వచ్చే పాత్రల విషయంలో తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.

 

అలా అల్లు అర్జున్ కూడా తొందరపడకుండా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్లే ఒక మంచి పని చేశాడు అని చెప్పవచ్చు. అదేంటంటే తాజాగా షారుఖ్ ఖాన్ నటిస్తున్న జవాన్ లో అల్లు అర్జున్ కు ఒక పాత్ర ఆఫర్ చేసినట్లు తెలిసింది. అయితే అల్లు అర్జున్ ఆ పాత్రకు నో చెప్పినట్లు తెలుస్తుంది. మామూలుగా షారుక్ ఖాన్ అంటే పెద్ద స్టార్ హీరో అని చెప్పాలి.

 

ఆయన సినిమాలో అవకాశం వస్తే ఎవరైనా తొందరపడతారు. కానీ అల్లు అర్జున్ మాత్రం బాగా ఆలోచించాడు. ఆ మధ్యనే అల్లు అర్జున్ పుష్ప వన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు పుష్ప టు సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాలో ఆయన హెయిర్ స్టైల్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 

దీంతో ఆ హెయిర్ స్టైల్ ను ఇంకా ఏ సినిమాలో వాడకూడదు అని జవాన్ ఆఫర్ ను వద్దనుకున్నాడు. నిజానికి ఆయన వద్దనుకోవడం ఒకింత ప్లస్ గా మారిందని తెలుస్తుంది. ఇక అదే ఆఫర్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కి కూడా వస్తే ఆయన కూడా వద్దనుకున్నట్లు తెలిసింది. దీంతో చివరికి సంజయ్ దత్ కి ఆ పాత్ర వచ్చినట్లు తెలుస్తుంది. మామూలుగా సంజయ్ దత్ చేయాల్సిన పాత్రనే అయినట్లయితే అల్లు అర్జున్ చేయకపోవటమే బెటర్ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -