Allu Sneha Reddy: అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి దాని వల్లే అందంగా కనిపిస్తున్నారా?

Allu Sneha Reddy: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా హీరోగా మంచి క్రేజీ సొంతం చేసుకున్నాడు. ఇక గతేడాది విడుదలైన పుష్ప సినిమా ద్వారా దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కూడా అందరికీ సుపరిచితమైన వ్యక్తి.

స్నేహ రెడ్డికి సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేనప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అంతే కాకుండా అందంలో కూడా స్నేహారెడ్డి హీరోయిన్ లకు ధీటుగా ఉంటుంది. అలాగే తన ఫిట్ నెస్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తు ఉంటుంది. ఇటీవల సోషల్ మీడియాలో స్నేహ రెడ్డి షేర్ చేసే గ్లామరస్ ఫోటోలకు ఫిదా అవుతున్నారు.

 

ఇలా ఈమె ఫోటో షూట్ కనుక చూస్తే స్నేహ రెడ్డి హీరోయిన్ గా సినిమాలలో ఎంట్రీ ఇస్తారని టాక్ వినిపిస్తోంది.తాజాగా స్నేహారెడ్డి తన గ్లామర్ కు సంబంధించిన సీక్రెట్ ను వెల్లడించారు. ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా స్నేహారెడ్డి గ్లామర్ రోజు రోజుకి పెరిగిపోతుంది. తాజాగా తన ఫిట్ నెస్ గురించి స్పందించిన స్నేహా రెడ్డి రోజూ ఉదయాన్నే యోగా చేసి ఫిట్ గా ఉండటం, సన్నగా ఉండటం రెండూ ఒకటి కాదని చెప్పుకొచ్చారు.

 

శారీరక, మానసిక, అధ్యాత్మిక ఆరోగ్యానికి సంబంధించినది ఫిట్ నెస్ అని ఆమె తెలిపారు. ఫిట్ నెస్ వల్లే తాను అందంగా కనిపిస్తున్నానని స్నేహారెడ్డి చెప్పుకొచ్చింది. స్టార్ హీరో భార్య గా యూత్ లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న స్నేహారెడ్డి ఒకవైపు గృహిణిగా తన భాద్యతలు నిర్వహిస్తూనే మరోవైపు వ్యాపారాలకు సంబంధించిన బాధ్యతలను నిర్వహిస్తూ కెరీర్ ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

 

ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య గా స్టైల్ విషయంలో బన్నీకి గట్టి పోటీ ఇస్తోంది. ఇలా ఈమె తరచూ చాలా స్టైలిష్ లుక్ లో పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు. ఇక తన ఫ్యామిలీకి, తన పిల్లలకి, బన్నీ సినిమాల గురించి తరచూ అప్ డేట్స్ ఇస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

MLA Grandhi Srinivas: పవన్ అభిమానులు లేకపోతే చిరు సినిమాలు ఆడవా.. వైసీపీ మూర్ఖత్వానికి హద్దుల్లేవా?

MLA Grandhi Srinivas: కొందరు రాజకీయ నాయకుల విమర్శలు చూస్తే నవ్వాలో ఏడవాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. చేసే విమర్శలకు జరిగే పరిణామాలకి ఏమాత్రం పొంతన కుదరని విమర్శలు వారినే నవ్వులపాలు...
- Advertisement -
- Advertisement -