Anasuya Bharadwaj: జబర్దస్త్ ను వదిలేసిన అనసూయ పరిస్థితి ఇంత ఘోరమా?

Anasuya Bharadwaj: హాట్‌ యాంకర్‌ అనసూయ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెరకి గ్లామర్ అద్దిన వాళ్ళలో అనసూయ కూడా ఒకరు. అనసూయ కెరీర్ ని బిఫోర్ అండ్ ఆఫ్టర్ `జబర్దస్త్`(Jabardasth) గా చూడవచ్చు. ఈ ప్రోగ్రామ్ అనసూయని జనాలకి మరింత దగ్గర చేయడానికి ఎంతో దోహదపడింది. జబర్దస్త్ అంటే అనసూయ అనసూయ అంటే జబర్దస్త్ ప్రోగ్రామ్ అనే విధంగా సాగింది కొన్ని సంవత్సరాలపాటు.

 

అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ షో ని వీడకుండా ఉండాల్సిందా..

జబర్దస్త్` షో తో పాటు అడపా దడపా మంచి పాత్రలతో వెండితెర మీద కూడా సందడి చేసింది ఈ రంగమ్మత్త. సినిమాలలో మంచి అవకాశాలు రావడంతో జబర్దస్త్ ని వదిలేసి స్టార్‌ మా ఛానల్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే. సుడిగాలి సుధీర్‌ కూడా ఈ షో లో ఒక భాగం. సుధీర్ తో కలిసి సూపర్‌ సింగర్ జూనియర్‌` షో యాంకర్ గా వ్యవహరిస్తోంది అనసూయ ప్రస్తుతం. అయితే ఆమె తీసుకున్న నిర్ణయం పెద్దగా ప్రయోజనం కలిగించలేదని కొందరు అంటున్నారు.

 

జబర్దస్త్ లో ఉన్నప్పుడు ఆమె బుల్లితెర మీద తరచుగా సందడి చేసింది. అయితే స్టార్‌ మా షో లో ఆమె చేస్తున్న ప్రోగ్రాం జబర్దస్త్ స్థాయిలో లేదు అనే మాట వినపడుతుంది. అసలే ఆ షో మంచి రేటింగ్స్ పొందలేకపోతుంది. ఇది అనసూయ మీద కూడా ప్రభావం చూపుతుందట. జబర్దస్త్ వొదలడం మంచి నిర్ణయం కాదట.

 

అనసూయ తరువాత రష్మీ ఆమె స్థానాన్ని భర్తీ చేసింది. ఇప్పుడు రష్మీ కూడా బిజీ అవవడంతో కన్నడ నటి సౌమ్య రావుని యాంకర్ గా తీసుకున్నారు. గతంలో అనసూయ జబర్దస్ మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. బాడీ షేమింగ్‌ కామెంట్లు కూడా భరించాను అని చెప్పుకొచ్చింది. దీంతో అనసూయ మళ్ళీ జబర్దస్త్ కి వెళ్ళే అవకాశాలు లేవనే చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -