Balakrishna: జూనియర్ ఎన్టీఆర్ పై బాలకృష్ణకు ఇంత ప్రేమా?

Balakrishna: నందమూరి తారకరామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి హరికృష్ణ బాలకృష్ణ వచ్చినప్పటికీ బాలకృష్ణ మాత్రం హీరోగా ఇండస్ట్రీలో బాగా సక్సెస్ అయ్యారు. ఇక హరికృష్ణ వారసుడిగా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి వచ్చారు.అయితే కెరీర్ మొదట్లో ఎన్టీఆర్ ను నందమూరి ఫ్యామిలీ తన కుటుంబ సభ్యుడిగా ఏమాత్రం అంగీకరించలేదు. ఎన్టీఆర్ హరికృష్ణ రెండవ భార్య కుమారుడు కావడంతో తనని నందమూరి ఫ్యామిలీ ఏ మాత్రం తమ కుటుంబ సభ్యుడిగా అంగీకరించలేదు.

 

ఇకపోతే హరికృష్ణ మాత్రం తండ్రిగా ఎన్టీఆర్ పట్ల తన బాధ్యతలను నిర్వర్తిస్తూ వచ్చారు. ఇలా ఇండస్ట్రీలోకి బాల నటుడిగా వచ్చిన ఎన్టీఆర్ అనంతరం కెరియర్ మొదట్లోనే వరుస సినిమాలలో నటించారు.ఇలా తన సినిమాలు కూడా మంచి సక్సెస్ సాధించడంతో ఈయన నందమూరి ఫ్యామిలీకి దగ్గరయ్యారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

 

ఇక కళ్యాణ్ రామ్ సైతం తారక్ ను తన తమ్ముడిగా ఎన్నోసార్లు ప్రకటించారు. మొత్తానికి ఎన్టీఆర్ ప్రస్తుతం నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ నందమూరి కుటుంబ పరువు ప్రతిష్టలను కాపాడుతున్నారు.అయితే ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అయినప్పటికీ తన బాబాయ్ బాలకృష్ణతో మాత్రం ఈయనకు మనస్పర్ధలు ఉన్నాయని అందుకే వీరిద్దరి మధ్య మాటలు కూడా లేవనీ అభిమానులు భావిస్తూ ఉంటారు.

 

ఈ విధంగా బాలకృష్ణ ఎన్టీఆర్ మద్య మనస్పర్తల కారణంగానే ఎన్టీఆర్ బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి కూడా హాజరు కాలేదని తెలుస్తోంది. అయితే బాలకృష్ణకు ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమని గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా బాలయ్య ఎన్టీఆర్ పై తనకు ఉన్న ప్రేమను బయటపెట్టారు. బాలకృష్ణకు ఎన్టీఆర్ పై ఎంత ప్రేమ అంటే ఎన్టీఆర్ తన కన్న కొడుకు కన్న ఎక్కువ అంటూ బాలకృష్ణ కామెంట్ చేయడంతో ఎన్టీఆర్ అంటే బాలయ్యకు అంత ఇష్టమా అని అభిమానులు ఎంతో సంతోషపడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -