Balayya :ముఖ్యమంత్రి కాబోతున్న బాలయ్య.. ఏం జరిగిందంటే?

Balayya :బాలయ్య అభిమానులకు శుభవార్త. త్వరలో బాలయ్య ముఖ్యమంత్రి పాత్రలో తెరపై కనిపించనున్నారు. పవర్‌ఫుల్ సీఎంగా.. ప్రజలకు అందించే మెరుగైన పాలన, రాజకీయ జీవితంలో ఎదురయ్యే శత్రులను ఎలా రఫ్పాడిస్తాడనే కాన్సెఫ్ట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమా స్టోరీ, న్యారేషన్, డైలాగులను బాలయ్య రీసెంట్‌గానే విన్నారని, కథను కూడా ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు పరుశురామ్ ఈ సినిమాను దర్శకత్వం వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు చేసిన పాలనను దృష్టిలో పెట్టుకుని ఈ క్యారెక్టర్‌ను సృష్టించినట్లు సమాచారం. ఇందులో బాలయ్య క్యారెక్టర్ ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించనుంది. అయితే ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే బాలయ్య.. పరుశురామ్‌తో కలిసి సినిమా చేయనున్నారు.

 

 

సినిమా విషయానికి వస్తే.. ఇప్పటివరకు డైరెక్టర్ పరశురామ్ సినీ ట్రాక్ రికార్డ్ బాగానే ఉంది. పూర్తి స్థాయిలో మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు చేయలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన సినిమాల్లో హైలెట్ ఫైట్స్ ఉన్నప్పటికీ.. హీరోను క్లాసిక్‌గా చూపించారనే కామెంట్స్ ఉన్నాయి. మరీ మాస్‌ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న బాలయ్య కోసం ఎలాంటి స్టోరీని సిద్ధం చేస్తాడనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న చిత్రం ‘వీరసింహారెడ్డి’. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా శృతిహాసన్ నటిస్తోంది. ఈ సినిమాలో కన్నడ నటుడు దునియా విజయ్ విలన్‌గా, కేజీఎఫ్ అవినాష్, తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించనున్నారు. సంక్రాంతి కానుకగా.. జనవరి 12న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. రాయలసీమలో జరిగిన వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అఖండ మూవీ కంటే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -