Balayya: బాలయ్య శ్రీలీల చంప పగలగొట్టడానికి అసలు కారణమిదా?

Balayya: నందమూరి నటసింహం బాలకృష్ణ కోపం ఎలాంటిదో మనకు తెలిసిందే. అయితే ఆయనని దగ్గరగా చూసిన వారికి మాత్రమే తనలో ఉన్న ప్రేమ కూడా కనిపిస్తుందని ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ఈ విషయాన్ని వెల్లడించారు. బాలయ్యకు కోపం మాత్రమే కాదు అంతే మంచి మనసు కూడా ఉందని ఎంతో మంది సెలబ్రిటీలు తెలియజేశారు.కోపం వస్తే ఆవేశంతో ఒక్క దెబ్బ కొట్టే బాలయ్య వెంటనే తన కోపం మర్చిపోయి ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు.

ఇలా ఇప్పటికే ఎంతోమంది అభిమానులు బాలకృష్ణ చేతిలో తన్నులు తిన్నవారు ఉన్నారు. అయితే తాజాగా నటి శ్రీ లీల సైతం బాలయ్య చేతిలో తన్నులు తిన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది. శ్రీ లీల బాలయ్య తెప్పించడంతో ఏకంగా ఆయన తనపై చేయి చేసుకున్నారని తెలుస్తోంది. బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

 

ఈ సినిమాలో హీరోయిన్లుగా కాజల్ అగర్వాల్ తో పాటు నటి శ్రీ లీల నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో శ్రీ లీలా కాస్త అల్లరి అమ్మాయి పాత్రలో నటించబోతున్నారట. అయితే తాను ఎంత చెప్పినా మారకపోవడంతో తనని సరైన దారిలో పెట్టడం కోసం బాలయ్య తనని కొట్టాల్సిన సన్నివేశం ఉందట. ఈ క్రమంలోనే ఈ సన్నివేశంలో నటించే సమయంలో చాలా నేచురల్ గా ఉండాలన్న ఉద్దేశంతో శ్రీ లీల తనని నిజంగానే కొట్టమని చెప్పారట.

 

ఇలా చెప్పడంతో బాలకృష్ణ కూడా ఆ సన్నివేశం చాలా నేచురల్ గా ఉండాలన్న ఉద్దేశంతో తనని లాగిపెట్టి ఒకటి కొట్టారని తెలుస్తోంది.ఇలా బాలకృష్ణ కొట్టడంతో ఒక్కసారిగా డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా షాక్ అయ్యారట.ఏది ఏమైనా శ్రీలీల చాలా డెడికేషన్ తో సినిమాలలో నటిస్తారు కనుక ఆమెకు తక్కువ సమయంలోనే ఎంతో మంచి సక్సెస్ రావడమే కాకుండా ఎన్నో సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

YS Sunitha: నిందితుడిని పక్కనే పెట్టుకుని అలాంటి కామెంట్లా.. జగన్‌కు సునీత దిమ్మదిరిగే కౌంటర్?

YS Sunitha: గత ఎన్నికల్లో వివేకాహత్యనే ప్రచార హస్త్రంగా వాడుకొని అధికారంలోకి వచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వివేకాహత్య కేసు గురించి చాలా అరుదుగా మాట్లాడారు. ఓ సారి అసెంబ్లీలో దీనిపై...
- Advertisement -
- Advertisement -