Balayya: జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేయాలని బాలయ్య ప్రయత్నిస్తున్నారా?

Balayya: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ట్ జూనియర్ ఎన్టీఆర్ కి తాజాగా ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో యావత్ సిని ప్రపంచం ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపిస్తోంది. కానీ, సొంత బాబాయ్ బాలకృష్ణ మాత్రం ఎన్టీఆర్ ఉనికిని గుర్తించలేకపోతున్నాడు. అయితే బాలయ్య బాబు ఆర్ఆర్ఆర్ టీమ్ నీ ఉద్దేశిస్తూ ట్వీట్ చేసాడు. కానీ తన ట్వీట్ లో ఎక్కడా కూడా ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురాలేదు. ఆర్ఆర్ఆర్ టీమ్ అంటే, అందులో ఎన్టీఆర్ కూడా వస్తారు అని నందమూరి అభిమానులు సరిపెట్టుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే కొందరు ఆస్కార్ పురస్కారం వచ్చింది కేవలం పాటకు మాత్రమే. ఇందులో నటీనటులకు క్రెడిట్ ఏమీ వుండదు వాదనను తెరపైకి తీసుకువస్తున్నారు. అయితే ఏ వేదిక పై అయినా కూడా ఎన్టీఆర్ బాలయ్య ప్రస్తావన తీసుకువస్తూనే ఉంటాడు. కానీ బాలయ్య మాత్రం ఇప్పటివరకు ఎప్పుడూ కూడా ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురాలేదు. హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీయార్, ప్రపంచ ఖ్యాతిని ఆర్జిస్తే జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకే ఆర్ఆర్ఆర్ టీమ్ కి అభినందనలు తెలిపే క్రమంలో జూనియర్ ఎన్టీయార్ పేరుని ప్రస్తావించలేకపోయాడు బాలయ్య బాబు.

 

ఇదే విషయంపై కొందరు ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. ఎందుకు ఎన్టీయార్ అంటే బాలయ్యకు ఇంత కోపం? ఎన్టీఆర్ సక్సెస్ బాలయ్యకు నచ్చలేదా? ఎన్టీఆర్ ను తొక్కేయాలని బాలయ్య ప్రయత్నిస్తున్నారా? అంటూ బాలయ్య బాబు నీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ప్రశ్నలపై బాలయ్య బాబు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి మరి. మొన్నటికి మొన్న తారకరత్న పెద్దకర్మ కార్యక్రమంలో అందరినీ పలకరించిన బాలయ్య బాబు జూనియర్ ఎన్టీఆర్ ను పలకరించకపోవడం పట్ల అభిమానులు మండిపడిన విషయం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -