Balayya: బోయపాటి శ్రీను బాలయ్యను అలా చూపించబోతున్నారా?

Balayya: నరసింహ బాలకృష్ణ ఏ పాత్ర చేసిన అందులో ఇట్టే ఇమిడిపోతారు. ఆయన చేసే ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులను మెప్పిస్తుంది అనడంలో ఎటువంటి డౌటు ఉండదు. అప్పుడెప్పుడో లెజెండ్ మూవీలో బాలకృష్ణ కాస్త పొలిటికల్ టచ్ ఉన్న ఒక సీన్ ని చేశారు. అయితే ఇప్పుడు ఏకంగా బాలయ్య సీఎం పాత్రలోనే కనిపించనున్నట్లు సమాచారం.

 

బోయపాటి శీను బాలయ్య కాంబినేషన్ కు తిరుగులేదు అనేదానికి లెజెండ్ ,సింహా లాంటి సినిమాలే నిదర్శనం. అసలు అఖండ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. బాలకృష్ణ లోని నట విశ్వరూపాన్ని అఖండ మూవీతో బోయపాటి అద్భుతంగా చూపించారు. ఇప్పుడు బాలయ్య చేయబోతున్న సినిమాలో బోయపాటి బాలయ్యను జనం కోసం పని చేసే ఒక గొప్ప సీఎం పాత్రలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

 

సీఎం పాత్రలో వైవిధ్యంగా చూపించిన ఎన్నో సినిమాల గురించి మనకు తెలుసు. సీఎం బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో వచ్చిన ఎన్నో మూవీస్ సక్సెస్ఫుల్ అయ్యాయి. మరి ఈ నేపథ్యంలో ఏకంగా వైసీపీకే షాక్ ఇచ్చేలా బాలయ్య డైలాగ్స్ మరియు సీన్స్ ఈ సినిమాలో ఉంటాయని భోగట్టా. కానీ ఇంకా దీని గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు.

 

ప్రస్తుతం బాలయ్య వీర సింహారెడ్డి సినిమాతో గత కొద్ది కాలంగా బాగా బిజీగా ఉన్నారు. సంక్రాంతి విడుదలకు బరిలోకి దిగుతున్న వీరసింహారెడ్డి పై బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అఖండ విజయం తరువాత బాలయ్య వరుస సినిమాలతో తలమునకలై ఉన్నారు. ఈ క్రమంలో వీర సింహారెడ్డి తరువాత అనిల్ రావిపూడి తో బాలకృష్ణ షూటింగ్ ప్రారంభమవుతుంది.

ఈ మూవీ పూర్తి అయిన వెంటనే బోయపాటి శ్రీను డైరెక్షన్లో బాలయ్య పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ చిత్రాన్ని చేయబోతున్నారని తెలుస్తోంది. అఖండ సక్సెస్ తరువాత బాలయ్య రెమ్యూనరేషన్ కూడా అఖండంగానే పెరిగింది. ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకి 15 కోట్ల నుంచి 20 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయినా సరే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ చిత్రానికి బాలయ్యే సరి జోడి అని బోయపాటి స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడట. సంచలనాత్మకమైన వీరి కాంబినేషన్లో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ చిత్రం రిలీజ్ అయితే అది ఏ రేంజ్ లో ఉంటుందో వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Mahanadu: ఆ కీలక నేతలు మహానాడుకు ఆ రీజన్ వల్లే మిస్ అయ్యారా?

Mahanadu: మహానాడు కార్యక్రమం ముగిసింది. 2024 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా బాబు ఈ మ‌హానాడును తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ ఫ్రేమ్‌ త‌న ఇమేజ్‌ క‌ల‌గ‌లిపి వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. అయితే...
- Advertisement -
- Advertisement -