Ram Charan: ఫ్యాన్స్ ట్రోల్స్ కు భయపడి చరణ్ ఆ ట్యాగ్ ను వాడటం లేదా?

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ హీరోగా అడుగుపెట్టిన కొంతకాలానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇక ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి పాన్ ఇండియా హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలో నటించటం వల్ల పాన్ ఇండియా హీరోగా మాత్రమే కాకుండా గ్లోబల్ స్టార్ గా కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్ రామ్ చరణ్ లకు తమ అభిమానులు గ్లోబల్ స్టార్స్ గా ట్యాగ్ ఇచ్చారు.

 

ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి సక్సెస్ అవ్వడంతో తమ హీరో గొప్పవాడు అంటే తమ హీరో గొప్పవాడు అంటూ ఎన్టీఆర్-రామ్ చరణ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ జరిగింది. ఈ క్రమంలో వారికి గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్స్ పుట్టుకొచ్చాయి. నందమూరి-మెగా హీరోల అభిమానులు ఒకరికొకరు పోటీగా తమ హీరోలను గ్లోబల్ స్టార్స్ అంటూ ఆకాశానికి లేపారు. ఇక ఆస్కార్ కి ముందు రామ్ చరణ్ అమెరికాలో సందడి చేసి అక్కడి మీడియాకు పలు ఇంటర్వ్యు లు ఇచ్చాడు.

ఈ క్రమంలో ఆయన గుడ్ మార్నింగ్ అమెరికా షోకి ఆహ్వానించబడ్డారు. అయితే ఆ షో నుండి ఆహ్వానం అందుకున్న తొలి ఇండియన్ హీరో రామ్ చరణ్. అలాగే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ‘స్పాట్ లైట్’ అవార్డుతో సత్కరించింది. ఈ అవార్డ్స్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరు కావాలని ఆహ్వానం పంపింది. దీంతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ బిరుదుకు అర్హుడే అని అభిమానులు తమ వాదన వినిపిస్తున్నారు. ఇక తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చాలా మంది అదే ట్యాగ్ తో బర్త్ డే విషెస్ తెలియజేశారు.

 

చరణ్ మాత్రం ఆ ట్యాగ్ ని అధికారికంగా వాడుకునేందుకు ఇష్టపడలేదు. గేమ్ ఛేంజర్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో చరణ్ పాత ట్యాగ్ మెగా పవర్ స్టార్ వాడారు.దీనికి కారణాలు అన్వేషిస్తే… రాజమౌళి సినిమాల సక్సెస్ క్రెడిట్ హీరోలకు దక్కదు. గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ వాడుకోవాలంటే కనీసం పాన్ ఇండియా హిట్ కొట్టాలి. నిజానికి ఆర్ఆర్ఆర్ హీరోలు గ్లోబల్ స్టార్ ఇమేజ్ కి ఇంకా చాలా దూరంలో ఉన్నారు. ఆ విషయం వాళ్లకు కూడా తెలుసు. కాబట్టి ఆ ట్యాగ్ అధికారికంగా తగిలించుకునే సాహసం చేయరని టాలీవుడ్ వర్గాల నుండి వినికిడి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -