Charan Prashant Neel: చరణ్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీకి అంత ఖర్చు చేస్తున్నారా?

Charan Prashant Neel: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కాగా గత ఏడాది విడుదల అయినా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ను ఫాలో అయ్యే వారి సంఖ్య మరింత పెరిగింది. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి దాదాపు 50% షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ , రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

 

కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. చెర్రీ పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు మెగా అభిమానులు. ఇకపోతే తాజాగా రామ్ చరణ్ కి సంబంధించి మరొక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.. అదేమిటంటే రామ్ చరణ్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా రానుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా దాదాపుగా 3 వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందించనున్నట్లు కూడా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బాబోయ్ ప్రశాంత్ నీల్, చెర్రీ కాంబినేషన్ కి అన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -