Chiranjeevi-Suman: సుమన్ జైలు పాలు కావడానికి చిరంజీవే కారణమా?

Chiranjeevi-Suman: మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్ ఎంటర్ టైన్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ రేపు విడుదల కానుంది. చాలా ఏళ్ల తర్వాత వింటేజ్ లుక్ లో ఊర మాస్ పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాబి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మూవీని మైత్రీ మూవీ మేకర్స్ వారు మూవీని తెరకెక్కించారు. అత్యంత భారీ స్థాయిలో షూటింగ్ జరుపుకుని ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల కానుంది. దాదాపు 22 ఏళ్ల క్రితం చిరుతో కలిసి అన్నయ్య’ మూవీలో నటించిన మాస్ మహారాజా రవితేజ ఇన్నేళ్ల విరామం తరువాత ఈ మూవీలో కీలక అతిథి పాత్రలో కనిపిస్తున్నారు.

జనవరి 13వ తేది ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రోమోలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ సినిమా ప్రచారం చివరి అంకానికి చేరుకుందని చెప్పాలి. మరి కొన్ని గంటల్లో యుఎస్ ప్రీమియర్స్ స్టార్ట్ కాబోతుండగా మీడియాతో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా మాట్లాడారు. అంతే కాకుండా పలు మీడియా సంస్థలకు యూట్యూబ్ ఛానల్స్ కి ఆయను ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వస్తున్నారు.

 

ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నటుడు అలనాటి హీరో సుమన్ ఇష్యూపై చిరు రియాక్ట్ అయ్యారు. ఒకానొక దశలో చిరంజీవి స్టార్ గా ఎదుగుతున్న క్రమంలో సుమన్ జైలు పాలు కావడానికి చిరంజీవే కారణమంటూ పలు పుకార్లు వైరల్ అయ్యాయి. దీనిపై తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి ఘాటుగా స్పందిస్తూ అసలు విషయం చెప్పారు. చిరుని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ‘సుమన్ బ్లూ ఫిల్మ్ కేసు’ గురించి స్పందించమని అడగడంతో ముందు చిరు నిరాకరించినా ఆ తరువాత అసలు ఏం జరిగిందో తెలిపారు.

 

అలాంటి వాటికి ఆన్సర్ ఇవ్వడం కూడా తనకు చాలా ఇబ్బందిగా ఉందని తెలిపారు. తాను సుమన్ మంచి స్నేహితులమని అన్నారు. ఎవడో పోరంబోకు జర్నలిస్ట్ ఏదో రాశాడని, పోరంబోకు అనే మాట హార్ష్ గా వుండొచ్చు కానీ వాడు ఏదో రాశాడా లేకుంటే రాసిన దాన్ని వక్రీకరించాడో కానీ అది చాలా వైరల్ అయ్యిందని తెలిపారు. సుమన్ కు తనకు ఎలాంటి విరోదం లేదని, ఇప్పటికీ తామిద్దరం మాట్లాడుకుంటుంటాం అని అన్నారు. సుమన్ తాను 80వ దశకం బ్యాచ్ రీ యూనియన్ లో కలుసుకుని మాట్లాడుకుంటూ ఉంటామని తెలిపారు. ఏ తప్పు చేయని వాడిపై ఆరోపణలు చేసి పైశాచిక ఆనందం పొందడం చాలా తప్పని చిరు అన్నారు. ఇలాంటివి సాగదీస్తూ వెళ్లినా తనకు ఎలాంటి ఇబ్బంది లేదంటూ చిరు ఘాటుగా స్పందించారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -