Mangalagiri MLA: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కు ఏపీ సీఎం జగన్ ఊహించని షాక్ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా అసంతృప్తికి గురైనట్లు ప్రచారం చేసుకుంటున్నా విషయం తెలిసిందే. అయితే జగన్ ఆర్కే కి దారి చూపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ ఇంతకాలం పక్కన పెట్టిన నేతలను తీసుకువచ్చి కీలక పదవులు ఇస్తున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరికి రాక ముందు తాడేపల్లిలో ఉండే దొందిరెడ్డి వేమారెడ్డి అనే రెడ్డిగారు వైసీపీ తరపున ఖర్చులన్నీ పెట్టుకుని పని చేసేవారు. ఆళ్ల వచ్చిన తర్వాత ఆయనను పక్కన పెట్టేశారు.
కాగా జగన్ పాదయాత్ర మంగళగిరిలో జరిగిన సమయంలో ఖర్చులన్నీ పెట్టుకున్నాడు వేమారెడ్డి. ఆ తరువాత జగన్ గెలిచి సీఎం అయ్యాక ఎమ్మెల్సీ వస్తుందని ఆశ పెట్టుకున్నారు. కానీ లెక్కలోకి కూడా తీసుకోలేదు. పార్టీ ఫిరాయించి వచ్చిన మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అయిన కూడా వేమారెడ్డి ఫీల్ కాలేదు. ఇప్పుడు ఆర్కే మెల్లగా పార్టీకి దూరం జరుగుతున్న సమయంలో జగన్ ఆయనను గుర్తించి మంగళగిరి వైసీపీకి అధ్యక్షుడిగా చేసేశారు. దాంతో ఆళ్లక ఊహించని షాక్ తగిలినట్లయింది.
మంగళగిరిలో వైసీపీని గెలిపించే బాధ్యతను ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్న ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డికే జగన్ ఇచ్చారు.అలాగే అయోధ్య రామిరెడ్డి డబ్బు సమస్యే లేకుండా చేసి పార్టీ ని మంగళగిరిలో గెలిపించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సారి తన సోదరుడు అయితే తట్టుకోలేడని ఆయన కూడా డిసైడయ్యారని అంటున్నారు. మొత్తంగా ఆళ్లకు జగన్ డోర్ చూపించినట్లయిందని చెబుతున్నారు.