Balayya Babu: ఆ బ్లాక్ బస్టర్ ను వదులుకోవడం బాలయ్య బాబు కెరీర్ పాలిట శాపమా?

Balayya Babu: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో హీరోయిన్ లు చేయాల్సిన సినిమాలు మరో హీరో హీరోయిన్ లు చేయడం అన్నది సర్వసాధారణం. అలా చేసిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయితే మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి.ఒకవేళ ఒక హీరో వదులుకున్న సినిమా మరో హీరో నటించి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి అనవసరంగా వదులుకున్నానే అని హీరోలు బాధపడిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అలా టాలీవుడ్ లో బాలకృష్ణ కూడా సూపర్ హిట్ సినిమాను వదులుకొని ఎంతో బాధపడ్డారట. ఆ తర్వాత అదే సినిమాను మోహన్ బాబు హీరోగా నటించి సూపర్ హిట్ అందుకున్నాడట.

మరి బాలయ్య వదులుకున్న సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మోహన్ బాబు సినిమా ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మోహ‌న్‌బాబు వ‌రుస ప్లాపుల్లో ఉన్న‌ప్పుడు దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావును తనకు ఒక సినిమా చేసి పెట్టమని కోరారట. అంతకు ముందు ప్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న చిరంజీవికి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాతో ఒక మెమొరబుల్ హిట్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత రాఘవేంద్రరావు మోహ‌న్ బాబుతో సినిమా చేశారు అది కూడా రీమిక్‌ సినిమా. నిజానికి అల్లుడు గారు సినిమాను బాలకృష్ణతో చేయాలని రాఘవేంద్రరావు భావించారు. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయింది.

 

ఆ సినిమాకి రీమేక్ గా అల్లుడుగారు సినిమా తెలుగులో తెరకెక్కింది. ముందుగా ఈ సినిమా కథను బాలయ్యకు చెప్పగా అయ‌న‌కు స్టోరీ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారు. ఈ టైప్ కథ త‌న‌కు న‌చ్చ‌ద‌ని బాల‌య్య రిజెక్ట్ చేశారు. ఇక తర్వాత ఈ రీమేక్ రైట్స్ మోహన్ బాబు దగ్గరికి వెళ్లడంతో ఇదే స్టోరీ తో మోహన్ బాబు హీరోగా అల్లుడుగారు సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో మోహన్ బాబుకు జంటగా రమ్యకృష్ణ, శోభన నటించారు.

Related Articles

ట్రేండింగ్

Giddi Eswari: పాడేరు టికెట్‌‌ గిడ్డి ఈశ్వరికే ఎందుకు.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?

Giddi Eswari:  ఎన్నికలకు పెద్దగా సమయం లేదు కానీ చంద్రబాబు నాయుడు చివరి క్షణంలో కూడా అభ్యర్థులను స్థాన మార్పిడి చేస్తూ అనూహ్యంగా కొత్తవారికి కూడా టికెట్లు కేటాయిస్తూ ఉన్నారు. ఇలా పలుచోట్ల...
- Advertisement -
- Advertisement -