Rajini Kanth: రజనీకాంత్ కు మోదీ బంపర్ ఆఫర్? కేంద్రంలో కీలక పదవి

Rajini Kanth: సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే తెలియని వారు దేశంలో ఎవరూ ఉండరు. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. చాలామంది హీరోలలో కూడా రజనీకాంత్ కు ఫ్యాన్స్ ఉన్నారు. రజనీకాంత్ కు అన్ని భాషల్లోనూ వీరాభిమానులు ఉన్నారు. సినిమాలతో పాటు సేవ చేయడంలోనూ రజనీకాంత్ ముందు ఉంటారు. సినిమాల్లో తన స్ట్రైల్ తో ఇప్పటికీ ఓ వెలుగు వెలుగుతున్నారు రజనీకాంత్. అయితే రాజకీయాలపై కూడా ఆయనకు ఆసక్తి ఉంది. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన కూడా రజనీకాంత్ కు ఉంది.

గతంలో తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని రజనీకాంత్ ప్రయత్నాలు చేశారు. అభిమానులతో కూడా చర్చలు జరిపారు. కొత్త పార్టీ పెట్టడం దాదాపు ఖాయమనే ప్రచారం కూడా జరిగింది. త్వరలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ ఏమైందో ఏమో కాని సడెన్ గా రజనీకాంత్ వెనక్కి తగ్గారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని ఒక ప్రకటన విడుదల చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు. అనారోగ్య కారణాల వల్ల రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని తేల్చిచెప్పారు.

అయితే రజనీకాంత్ వెనుక బీజేపీ ఉందనే ప్రచారం జరిగింది. బీజేపీ ఒత్తిడితోనే రజనీకాంత్ వెనక్కి తగ్గారనే వార్తలు అప్పట్లో వచ్చాయి. గతంలో చెన్నై వచ్చినప్పుడు ప్రధాని మోదీ స్వయంగా రజనీకాంత్ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. దాదాపు గంటలపాటు అప్పుడు ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత రాజకీయంగా రజనీకాంత్ దూరంగా ఉండగా.. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలకు రజనీకాంత్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లతో రజనీకాంత్ భేటీ అయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవితో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.

గవర్నర్ ను కలిసిన అనంతరం తామిద్దరం రాజకీయాల నుంచి మాట్లాడుకున్నట్లు రజనీ ప్రకటించడం గమనార్హం. దీనిని బట్టి చూస్తే మోదీ కనుసన్నల్లోనే రజనీ నడుస్తారనే ప్రచారం ఊపందుకుంది. వచ్చే ఎన్నికల్లో తమిళనాడులో బలం పుంజుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా రజనీని మళ్లీ తెరపైకి తెచ్చింది. దీంతో రజనీకాంత్ ను గవర్నర్ పదవి ఇచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు మోదీ నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రజనీకాంత్ కు గవర్నర్ పదవి ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందని మోదీ భావిస్తున్నారు.

వీరిద్దరు ద్వారా బీజేపీ తమిళనాడులో బలపడాలని చూస్తోంది. తమిళనాడులో రజనీకాంత్ కు చాలామంది అభిమానులు ఉన్నారు. దీంతో రజనీని బీజేపీ రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తోంది. మోదీ, రజనీకి మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో రజనీకి గవర్నర్ పదవి ఇవ్వడం ద్వారా తమిళనాడులో బలపడాలని చూస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Janasena Complaint on YS Jagan: ఏపీ ఎన్నికల సంఘం దృష్టికి పవన్ పెళ్లిళ్ల గోల.. జగన్ కు భారీ షాక్ తప్పదా?

Janasena Complaint on YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్లిన ఏ సభకు వెళ్లిన అక్కడ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావనకు తీసుకువస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్...
- Advertisement -
- Advertisement -